ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Nagarkurnool - Aug 08, 2020 , 03:46:27

హోం ఐసోలేషన్‌ కిట్లు పంపిణీ

హోం ఐసోలేషన్‌ కిట్లు పంపిణీ

నాగర్‌కర్నూల్‌ టౌన్‌: ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఎంజేఆర్‌ ట్రస్టు ఆధ్వర్యంలో శుక్రవారం కరోనా సోకిన వారికి కిట్లను పంపిణీ చేశారు. రూ.మూడు వేలు విలువ చేసే హోం ఐసోలేషన్‌ కిట్‌లో 12 రకాల వస్తువులు(పల్స్‌ ఆక్సీమీటర్‌, థర్మామీటర్‌, కొవిడ్‌ ఆర్‌ఎక్స్‌ ఇమ్యూనైజేషన్‌ బూస్టర్‌, ఆవిరి పట్టే మాత్రలు, కాల్షియం, జ్వరం నివారణ మాత్రలు, శానిటైజర్‌, సర్జికల్‌ మాస్కులు, మౌత్‌వాష్‌, పేపర్‌ గ్లాసులు, సబ్బులు) ఉన్నాయన్నారు. రోగులు ఎలాంటి ఆరోగ్య సూత్రాలు పాటించాలి, ఏ ఆహారం తీసుకోవాలి, ఆరోగ్య పరిస్థితిలో మార్పు వస్తే ఏం చేయాలి వంటి వాటికి మార్గదర్శకాలతో కూడిన కరపత్రాలు కిట్‌లో పొందుపరిచారు. అనంతరం నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పర్యటించి బాధితులకు కిట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు భాస్కస్‌గౌడ్‌, ఇమ్రాన్‌ఖాన్‌, హరికృష్ణ, సురేందర్‌రెడ్డి, శేఖర్‌జీ, అంజి తదితరులు పాల్గొన్నారు. logo