గురువారం 01 అక్టోబర్ 2020
Nagarkurnool - Aug 07, 2020 , 04:49:46

సార్‌ సేవలు చిరస్మరణీయం

సార్‌ సేవలు  చిరస్మరణీయం

  • g    అపర మేధావి ప్రొఫెసర్‌ జయశంకర్‌
  • g    తెలంగాణ సాధనలో అలుపెరగని పోరాటం
  • g    ఆయన అడుగుజాడల్లో యువత నడవాలి
  • g    ఉమ్మడి జిల్లాలో ఘనంగా జయంతి వేడుకలు 
  • g    నివాళులర్పించిన మంత్రి నిరంజన్‌రెడ్డి,  ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు

కల్వకుర్తి రూరల్‌ : తెలంగాణ జాతిపిత, ఉద్యమ సారధి, దిశానిర్దేశకుడు ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌ సేవలు చిరస్మరణీయని ఎంపీ రాములు, ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌ పేర్కొన్నారు. గురువారం కల్వకుర్తి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో, గచ్చు బావి వద్ద, పంజుగు ల గ్రామంలో జయశంకర్‌సార్‌ జయం తి నిర్వహించారు. ఎంపీ, ఎమ్మెల్యేలు అ దనపు కలెక్టర్‌ మనుచౌదరితో కలిసి జయశంకర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ రాములు మా ట్లాడుతూ జయశంకర్‌ సార్‌ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం దుబ్బాక ఎ మ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి చిత్రపటానికి పూలమాల వే సి నివాళులర్పించారు. టీఆర్‌ఎస్‌ పార్టీ ఉన్నతికి రామలింగారెడ్డి విశేషంగా కృషి చేశారని, ఆయన మృతి పార్టీకి తీరనిలోటని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో కల్వకుర్తి మార్కెట్‌ క మిటీ చైర్మన్‌ బాలయ్య, మున్సిపల్‌ చైర్మన్‌ ఎడ్మ సత్యం, వైస్‌ చైర్మన్‌ షాహేద్‌, జెడ్పీటీసీ భరత్‌ ప్రసాద్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు విజయ్‌గౌడ్‌, ఎంపీపీ సునీత, పంజుగుల సర్పంచ్‌ పద్మ, ఎంపీటీసీ మనోహర, నాయకులు పాల్గొన్నారు.

సీసీ రోడ్డు, హైమాస్ట్‌ లైట్లు ప్రారంభం 

నిర్జీవంగా ఉన్న గ్రామాలకు టీ ఆర్‌ఎస్‌ సర్కార్‌ ఇతోధికంగా నిధులందించి పల్లెలకు పునర్‌వైభవం కల్పిస్తోందని ఎం పీ రాములు, ఎమ్మెల్యే జైపా ల్‌ యాదవ్‌ పేర్కొన్నారు. గు రువారం మెగాప్లాంటేషన్‌కు వ చ్చిన ఎంపీ, ఎమ్మెల్యే, అదనపు క లెక్టర్‌ మనుచౌదరి, జెడ్పీటీసీ భరత్‌ప్రసాద్‌లను పంజుగుల సర్పంచ్‌ పద్మ, ఎంపీటీసీ మనోహర ఘనంగా స్వాగతించారు. ఈ సందర్భంగా పంజుగుల గ్రామంలోని తొమ్మిదో వార్డులో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును, పీర్ల చావిడి, గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన హైమాస్ట్‌ లైట్లను ప్రారంభించారు. అనంతరం గుండూరు గ్రామంలో ఈజీఎస్‌ కూలీలతో మాట్లాడారు. మూడు నెలలుగా కూలి చెల్లించడం లేదని వారి దృష్టికి తీసుకురావడంతో.., వెంటనే డబ్బులు అందేలా ఏ ర్పాటు చేయాలని

అధికారులకు సూచించారు. గుండూరులో దివ్యాంగుడు నవీన్‌ ఇటీవల ప్రారంభించిన డిజిటల్‌ సేవా కేం ద్రాన్ని సందర్శించి అభినందించారు. చాలా మంది నిరుపేద లు ఇండ్లు లేక ఇబ్బందులు పడుతున్నారని, వారికి డబుల్‌ బె డ్‌రూం ఇండ్లు మంజూరు చేయాలని, స్థలాలు ఉన్నవారికి ప్ర భుత్వం నుంచి సాయం అందించాలని కల్వకుర్తి పట్టణంలోని ఏడో వార్డుకు చెందిన అంబేద్కర్‌ యువజన సంఘం నాయకులు, స్ధానికులు వినతి అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ సునీత, సర్పంచ్‌లు కిష్టారెడ్డి, జంగయ్య, రేణుక, ఎంపీటీసీ నర్సిరెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల ఉపాధ్యక్షుడు పరశురాములు, నాయకులు అంజియాదవ్‌, చెన్నకేశవులు, గణేశ్‌, శ్రీను, అం జయ్యగౌడ్‌, జంగయ్య  తాసిల్దార్‌ రాంరెడ్డి, ఎంపీడీవో బాలచంద్ర సృజన్‌, ఎంపీవో దేవేందర్‌, పంచాయతీ కార్యదర్శులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.


తాజావార్తలు


logo