మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Nagarkurnool - Aug 07, 2020 , 04:37:37

మానవ మనుగడకు చెట్లే ఆధారం

మానవ మనుగడకు చెట్లే ఆధారం

  • పతి ఒక్కరూ బాధ్యతతో మొక్కలు నాటి సంరక్షించాలి
  • ఎంపీ రాములు, ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌, ఏసీ మనూ చౌదరి

కల్వకుర్తి : మానవ మనుగడకు చెట్లే ఆధారమని, ప్రతి ఒక్కరూ బాధ్యతతో మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఎంపీ రాములు, కల్వకుర్తి ఎమ్మెల్యే జై పాల్‌ యాదవ్‌ పిలుపునిచ్చారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని గచ్చుబావి చౌరస్తా సమీపం నుంచి మం డలంలోని రఘుపతిపేట వరకు దాదా పు 18 కిలోమీటర్ల మేర 4000 మొక్క లు నాటే లక్ష్యంతో చేపట్టిన మెగా హరితహారం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే జైపా ల్‌, అదనపు కలెక్టర్‌ మనూ చౌదరితో కలిసి ఎంపీ ప్రారంభించారు. పంజుగుల, గుండూరు, లింగసానిపల్లి గ్రామాలలో వారు మొక్కలు నాటారు.  ఈ సం దర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ఎంపీ, ఎమ్మెల్యే మాట్లాడుతూ భవిష్యత్‌ తరాలను దృష్టిలో ఉంచుకుని సీఎం కేసీఆర్‌ హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు. నాటిన మొక్కలను సంరక్షించే బాధ్యతను గ్రామ పంచాయతీలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ భరత్‌ప్రసాద్‌, ఎంపీపీ సునీత, సర్పంచులు పద్మ, కిష్టారెడ్డి, సు శీల, జంగయ్య, బాలస్వామి, ఎంపీటీసీలు మనోహర, నర్సిరెడ్డి, కోఆప్షన్‌ స భ్యుడు రుక్నద్దీన్‌, మార్కెట్‌ కమిటీ చైర్మ న్‌ బాలయ్య, వైస్‌ చైర్మన్‌ విజయ్‌గౌడ్‌, పీఏసీసీఎస్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌రావు, నాయకులు కుర్మయ్య, చెన్నకేశవులు, ఆంజనేయులు, శ్రీనివాస్‌, పరశురాం, గణేశ్‌, వెంకటయ్య పాల్గొన్నారు.


logo