సోమవారం 21 సెప్టెంబర్ 2020
Nagarkurnool - Aug 07, 2020 , 04:31:09

పాడి, మత్స్యకారులు ఆర్థికంగా ఎదగాలి

పాడి, మత్స్యకారులు ఆర్థికంగా ఎదగాలి

  •  ప్రిన్సిపల్‌ సెక్రటరీ అనితా రాజేంద్ర

  నాగర్‌కర్నూల్‌ టౌన్‌ (బిజినేపల్లి) : పాడి రైతులు, మత్స్యకారులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని, అందుకోసం అందిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ప్రిన్సిపల్‌ సెక్రటరీ అనితా రాజేంద్ర సూచించారు. గురువారం నాగర్‌కర్నూల్‌ జిల్లా బిజినేపల్లి మండలం పాలెం పెంటోని చెరువులో చేప పిల్లలను విడుదల చేశారు. అనంతరం కృత్రిమ గర్భధారణ ద్వారా జన్మించిన లేగదూడలు, తూర్పు గిద్దల ప్రదర్శనను తిలకించి రెండో విడుదల కృషి కల్యాణ్‌ అభియాన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గతేడాది పంపిణీ చేసిన గొర్రెలతో ఆర్థికంగా లబ్ధిపొందిన 18 మందితో మాట్లాడారు.

గొర్రెల పంపిణీ లాభదాయకంగా ఉందని, మరో విడుదల పంపిణీ చేయాలని పలువురు కోరారు. ఆత్మ నిర్భర భారత్‌ పథకంలో భాగంగా రూ.45 లక్షల రుణ సదుపాయం కోసం కిసాన్‌ క్రెడిట్‌ కార్డులను పాడి రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చేప పిల్లల పంపిణీతోపాటు రూ.10 కోట్ల ఖర్చుతో 5 కోట్ల రొయ్య పిల్లలను చెరువుల్లో విడుదల చేయనున్నట్లు తెలిపారు. మత్స్య, పాడి పరిశ్రమకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. కృషి కల్యాణ్‌ ద్వారా ఆడ దూడల గర్భధారణతో పాల ఉత్పత్తిని పెంపొందించాలన్నారు. పశుసంవర్ధకశాఖ అధికారులు, డాక్టర్లు, సిబ్బంది క్షేత్రస్థాయిలో రైతులకు అందుబాటులో ఉంటూ తోడ్పాటునందించాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర పశుసంవర్ధక శాఖ డైరెక్టర్‌ లక్ష్మారెడ్డి, డెయిరీ ఎండీ శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్‌ హన్మంత్‌రెడ్డి, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి అంజిలప్ప, మధుసూదన్‌రావు, మహిపాల్‌ శంకర్‌ రాథోడ్‌, ఆర్డీవో నాగమణి, ఎంపీపీ శ్రీనివాస్‌గౌడ్‌, సర్పంచ్‌ లావణ్య, ఏడీ వెంకటేశ్వర్‌రావు, మండల పశువైద్యాధికారి బుచ్చమ్మ, ప్ర జాప్రతిధులు, అధికారులు పాల్గొన్నారు


logo