బుధవారం 23 సెప్టెంబర్ 2020
Nagarkurnool - Aug 06, 2020 , 02:26:15

కరోనా మహమ్మారిని పారదోలుదాం

కరోనా మహమ్మారిని పారదోలుదాం

నాగర్‌కర్నూల్‌ టౌన్‌: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని పారదోలుదామని, కొవిడ్‌ బాధితులకు ఎంజేఆర్‌ ట్రస్టు అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. ఎంజేఆర్‌ ట్రస్టు ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఉచిత కషాయ వితరణ కేంద్రాన్ని ట్రస్టు డైరెక్టర్‌ మర్రి జమున ప్రారంభించారు. కరోనా బాధితులకు హోం ఐసొలేషన్‌ కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ట్రస్టు అధినేత, ఎమ్మెల్యే మర్రి మాట్లాడుతూ రోగ నిరోధకశక్తి పెంచే కషాయం సెంటర్‌ను జిల్లా కేంద్రంలోని బస్టాండ్‌ ఆవరణలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. హోం ఐసొలేషన్‌లో ఉన్న వారికి కిట్లు అందజేస్తామన్నారు. కిట్‌లో మాత్రలు, శానిటైజర్‌, సర్జికల్‌ మాస్కులు, మౌత్‌వాష్‌, పేపర్‌ గ్లాసులు, సబ్బులు, దావచాయితో కూడిన వస్తువులు ఉంటాయన్నారు. వైరస్‌ నివారణకు పాటించే ఆరోగ్య సూత్రాలు, పౌష్టికాహారం వంటి మార్గదర్శకాలతో కూడిన కరపత్రాలను విడుదల చేశారు. కార్యక్రమం లో ఉమ్మడి జిల్లా డీసీసీబీ డైరెక్టర్‌ జక్కా రఘునందన్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ కల్ప న, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కుల అందజేత

బాధితులకు మంజూరైన సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులను జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మర్రి పంపిణీ చేశారు. జిల్లా కేంద్రానికి చెందిన మణికంఠ, దేశిటిక్యాల గ్రామానికి చెందిన నాగేశ్వర్‌రెడ్డిలకు చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ బాబురావు, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు సుబ్బారెడ్డి, బాధిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

ఆలయ నిర్మాణానికి భూమిపూజ

నాగర్‌కర్నూల్‌ టౌన్‌(బిజినేపల్లి) : బిజినేపల్లి మండలకేంద్రంలో ఆంజనేయస్వామి ఆలయ నిర్మాణానికి బుధవారం ఎమ్మెల్యే మర్రి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న రామ మందిర నిర్మాణానికి ప్రధాని మోడీ భూమిపూజ చేశారన్నారు. సాక్షాత్తు ఆ శ్రీరాముని బం టు ఆంజనేయస్వామి దేవాలయ నిర్మాణా న్ని కూడా అదేరోజు భూమిపూజ చేసినందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు.

తిమ్మాజిపేట: రైతు వేదికల ద్వారా వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకోనున్నాయని ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం మండలంలోని గుమ్మకొండ గ్రామంలో రూ.22 లక్షలతో నిర్మిస్తున్న రైతువేదిక భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వ్యవసాయంలో వచ్చే మార్పులను రైతువేదికల ద్వారా అన్నదాతలకు చేరవేయొచ్చన్నారు. ప్రపంచంలో ఎక్కడ సాగు పద్ధతులు మారినా క్షణాల్లో రైతు ముంగిట్లోకు ఉంచేందుకు దోహదపడుతాయన్నారు. రైతులంతా ఒకచోట సాగు పద్ధుతులు, చీడపీడల నివారణ, మార్కెట్‌, మందుల గురించి చర్చించేందుకు ఉపయోగపడుతుందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో రైతుకు అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్‌ జక్కా రఘునందన్‌రెడ్డి, ఎంపీపీ రవీంద్రనాథ్‌రెడ్డి, జెడ్పీటీసీ దయాకర్‌రెడ్డి, తాసిల్దార్‌ సరస్వతి, ఎంపీడీవో కరుణశ్రీ, సర్పంచ్‌ల సంఘం మండలాధ్యక్షుడు వేణుగోపాల్‌గౌడ్‌, సర్పంచులు సత్యంయాదవ్‌, మురళీధర్‌రెడ్డి, తిరుపతమ్మ, ఏవో కమల్‌కుమార్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు స్వామి, ప్రధాన కార్యదర్శి రఘుమారెడ్డి, నాయకులు అయూబ్‌, నరేందర్‌ పాల్గొన్నారు.logo