ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Nagarkurnool - Aug 04, 2020 , 09:09:14

కరోనాపై నిర్లక్ష్యం వద్దు

కరోనాపై నిర్లక్ష్యం వద్దు

 ఆర్డీవో రాజేశ్‌కుమార్‌

కల్వకుర్తి రూరల్‌: కరోనాపై ఎవరూ నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని ఆర్డీవో రాజేశ్‌కుమార్‌ సూచించారు. సోమవారం కల్వకుర్తి మండలంలోని మార్చాల సత్యసాయినగర్‌ కాలనీలోని  కాటన్‌ మిల్లులో పలువురికి  కరోనా వైరస్‌ సోకడంతో ఆర్డీవో రాజేశ్‌కుమార్‌ తాసిల్దార్‌ రాంరెడ్డి, సీఐ సైదులు  కాటన్‌మిల్లు  పరిసరాలను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు.  మిల్లు ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని నిర్వాహకులకు సూచించారు.  హైపోక్లోరైట్‌ ద్రావణం పిచికారీ చేయించడంతోపాటు బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లించారు.  కాలనీ ప్రజ లు అనవసరంగా బయటకు రావద్దని కోరారు.  కరోనా వ్యాధిగ్రస్తులు నిత్యం పాటించాల్సిన ఆరోగ్య సూత్రాలు, నియమాల గురించి వారికి వివరించారు. 


logo