ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Nagarkurnool - Aug 04, 2020 , 09:09:16

నిరాడంబరంగా రక్షాబంధన్‌

నిరాడంబరంగా రక్షాబంధన్‌

  •  n కరోనా కష్టకాలంలో  కొరియర్‌లో రాఖీలు పంపిన తోబుట్టువులు
  •  n ఇంట్లోనే తయారు చేసిన మిఠాయిలు
  •  n దుకాణాల్లో కనిపించని సందడి

కల్వకుర్తి : సోదర సోదరీమణుల అనురాగం, ఆప్యాయతలకు ప్రతీకగా నిలిచే రాఖీ పౌర్ణమి వేడుకలు సోమవారం కల్వకుర్తి నియోజకవర్గంలో నిరాడంబరంగా సాగాయి.  దూరప్రాంతాల్లో ఉంటున్నవారు  కరోనా వైరస్‌ నేపథ్యంలో తమ సోదరులకు కొరియర్‌లో రాఖీలను పంపారు. సమీప ప్రాంతాల్లో ఉండే వాళ్లు మాత్రం ఉదయాన్నే తమ పుట్టింటికి వచ్చి తమ సోదరులకు రాఖీలు కట్టి ఆశీర్వా దాలు అందుకున్నారు. సోదరులు ఇచ్చే బహుమతులు అందుకున్నారు. ఈసారి కరోనా మహమ్మారి రాఖీ పండుగకు ప్రతిబంధకంగా మారింది. హడావిడి లేకుండా పండుగ సా గింది. రాఖీలు, స్వీట్ల దుకాణాల్లో సందడి కనిపించలేదు. ఇండ్లల్లోనే తీపి వంటకాలు చేసుకున్నారు.

వివిధ గ్రామాల్లో..

కల్వకుర్తి రూరల్‌: కల్వకుర్తి మండలంలోని అన్ని గ్రామాలలో సోమవారం రాఖీపౌర్ణమి పర్వదినాన్ని ప్రజలు ఘ నంగా నిర్వహించుకున్నారు. కల్వకుర్తి పద్మశాలీ భవన్‌లో భక్త మార్కండేయ సేవా సమితి ఆధ్వర్యంలో రాఖీపౌర్ణమి వేడుకలను నిర్వహించారు. రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌, యువజన సంఘాలు, పాఠశాలల ఆధ్వర్యంలో  రక్షాబంధన్‌ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఇతర గ్రామాల్లో, పట్టణాల్లో ఉంటున్న వారు పండుగ సందర్భంగా గ్రామాలకు చేరుకోవడంతో గ్రామాలు సందడిగా మారాయి.

వంగూరులో..

వంగూరు: అన్నా చెలెళ్ల అనుబంధానికి నిదర్శనమైన రాఖీ పౌర్ణమిని సోమవారం మండల ప్రజలు ఘనంగా జరుపుకొన్నారు.మండలంలోని వివిధ గ్రామాల్లో మహిళలు నూతన వస్ర్తాలు ధరించి తమ సోదరులకు రాఖీలు కట్టి మిఠాయిలను తినిపించారు. తోబుట్టువులే కాకుండా సోదర ప్రేమకు నిదర్శనంగా గ్రామాల్లో పలువురు పరస్పరం రాఖీలు కట్టుకుని శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.

చారకొండలో..

చారకొండ: రాఖీ పౌర్ణమిని పురస్కరించుకొని సోమవారం మండలంలోని వివిధ గ్రామాల్లో  రక్షా బంధన్‌ వేడుకలు ఘనంగా నిర్వహించారు నేను నీకు రక్ష, నాకు నీవు రక్ష.. ఇద్దరం కలిసి దేశానికి రక్ష అంటూ అక్కా చెల్లెళ్లు, అన్నదమ్ములకు రాఖీలు కట్టారు. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు సోదరులకు రాఖీలు కట్టి మాస్కులు, శానిటైజర్లు అందించారు. 

వెల్దండలో..

వెల్దండ: రక్షాబంధన్‌ వేడుకలను సోమవారం వెల్దండ మండల ప్రజలు  వైభవంగా జరుపుకున్నారు. ఆడ పడుచులు తన పుట్టింటికి రావడంతో గ్రామాల్లో పండుగ సందడి నెలకొంది. రాఖీ పౌర్ణమి సందర్భంగా అక్క, చెల్లెళ్లు తమ తోబుట్టువులైన అన్నదమ్ములకు, మిత్రులకు రాఖీలను కట్టి మిఠాయిలు తినిపించి అప్యాయత, అనురాగాలను పంచుకున్నారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు వేడుకల్లో పాల్గొన్నారు.

చెట్లకు రాఖీలు కట్టిన చిన్నారులు

బైరాపూర్‌ గ్రామంలో కౌన్సిల్‌ ఫర్‌ గ్రీన్‌ రెవెల్యూషన్‌ వృక్షాబంధన్‌ పిలుపు మేరకు శృతిలయ కల్చరల్‌ అకాడమీ ఆధ్వర్యంలో విద్యార్థులు చెట్టూ నీకు నేను రక్ష.. నాకు నీవు రక్ష అనే నినాదంతో చెట్లకు రాఖీ కట్టి వృక్షాబంధన్‌ నిర్వహించారు. 


logo