శనివారం 19 సెప్టెంబర్ 2020
Nagarkurnool - Aug 04, 2020 , 09:09:16

వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృతి

వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృతి

  • చిన్నంబావి మండలం లక్ష్మీపల్లి స్టేజీ వద్ద అన్నాచెల్లెలు..
  •  సింగాయిపల్లి వద్ద స్కూటీ అదుపుతప్పి ఓ వ్యక్తి..
  • చౌదర్‌పల్లి స్టేజీ వద్ద కారు ఢీకొని ఓ యువతి
చిన్నంబావి : అన్నకు రాఖీ కట్టి తిరుగుప్రయాణంలో ఉండగా మృత్యువు వారిని కబళించింది. బైక్‌పై వెళ్తున్న వారిని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో అన్నాచెల్లెలు మృతిచెందిన సంఘటన వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం లక్ష్మీపల్లి స్టేజి సమీపంలో సోమవారం చోటుచేసుకున్నది. వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం తూముకుంట గ్రామానికి చెందిన బంకల నందిని(14), ఆమె పెద్దనాయన కొడుకు బంకల దామోదర్‌ (16)తో కలిసి రాఖీ పౌర్ణమి సందర్భంగా చిన్నంబావి మండలం పెద్దదగడ గ్రామంలో ఉన్న మరో సమీప బంధువుకు రాఖీ కట్టి తిరుగు ప్రయాణమయ్యారు. లక్ష్మీపల్లి స్టేజీ మూలమలుపు వద్ద పెబ్బేర్‌ నుంచి కొల్లాపూర్‌కు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీ కొనడంతో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తిరుగు ప్రయాణంలో వీరి వెంట తూ ముకుంట గ్రామానికి రాఖీ కట్టడం కోసం వెళ్తున్న పెద్దదగడ గ్రామానికి చెందిన పోతుగంటి లక్ష్మి అనే యువతి ఇదే ప్రమాదంలో గాయపడగా మెరుగైన వైద్యం కోసం వనపర్తి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మృతదేహాలను కొల్లాపూర్‌ ప్రభుత్వ దవాఖానకు తరలించి పోస్టుమార్టం నిర్వహించనున్నట్లు పోలీసులు తెలిపారు. 
స్కూటీ అదుపు తప్పి వ్యక్తి..
కోడేరు : స్కూటీపై వేగంగా వెళ్తూ అదుపుతప్పి రోడ్డు కింద పడి ఓ వ్యక్తి మృతి చెం దిన సంఘటన మండలంలోని తుర్కదిన్నె-సింగాయిపల్లి గ్రామాల మధ్య సోమవా రం చోటు చేసుకున్నది. కోడేరు ఎస్సై భాగ్యలక్ష్మీరెడ్డి కథనం ప్రకారం.. మండలంలోని ముత్తిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన విష్ణువర్ధన్‌రెడ్డి(55) తన స్కూటీపై సొంత పనుల నిమిత్తం సింగాయిపల్లి గ్రామం వైపు వెళ్తున్నాడు. తుర్కదిన్నె గ్రామం అనంతరం వేగంగా వెళ్లి రోడ్డపై అదుపు తప్పి వ్యవసాయ పొలంలో పడ్డాడు. ఈ ఘటనలో విష్ణువర్ధన్‌రెడ్డి అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. 
స్కూటీని ఢీకొన్న కారు..
దేవరకద్ర రూరల్‌ : స్కూటీని కారు ఢీకొన్న ఘటనలో స్కూటీపై ఉన్న యువతికి తీ వ్ర గాయాలు కాగా, దవాఖానలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఎస్సై భగవంత్‌రెడ్డి కథనం మేరకు.. నారాయణపేట జిల్లా కేంద్రానికి చెందిన వడ్ల నాగరాణి (21), జాజాపూర్‌ గ్రామానికి చెందిన సిద్ధప్పతో(25) కలిసి ఉదయం 11 గంటల ప్రాం తంలో స్కూటీపై మహబూబ్‌నగర్‌కు బయలుదేరారు. చౌదర్‌పల్లి స్టేజీ సమీపంలో కా కతీయ పాఠశాల వద్ద మహబూబ్‌నగర్‌ నుంచి దేవరకద్ర వైపు వస్తున్న కారు స్కూటీని ఢీకొట్టింది. దీంతో నాగరాణికి తీవ్ర గాయాలు కాగా స్థానికులు పోలీసులకు సమాచారమందించారు. క్షతగాత్రులను మహబూబ్‌నగర్‌ జిల్లా జనరల్‌ దవాఖానకు తరలించగా, నాగరాణి అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందిందని, సిద్ధప్ప చికిత్స పొందుతున్నాడని ఎస్సై తెలిపారు. 


logo