శనివారం 08 ఆగస్టు 2020
Nagarkurnool - Aug 02, 2020 , 08:15:57

పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

  •  సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కు పంపిణీ చేసిన ఎమ్మెల్స్డీ 

కల్వకుర్తి: పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పనిచేస్తుందని శాసనమండలి చైర్మన్‌ కసిరెడ్డి నారాయణరెడ్డి పేర్కొన్నారు. కల్వకుర్తి నియోజకవర్గం ఆమనగల్లు మండలం సంకటోనిపల్లి గ్రామానికి చెందిన రాములమ్మ అనారోగ్యానికి గురికాగా వైద్య సహాయం కోసం సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకుంది. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో ఆమెకు సీఎం సహాయనిధి నుంచి రూ.20వేలు మంజూరయ్యాయి. ఈమేరకు ఆమె కుటుంబ సభ్యుడు రవీందర్‌కు  శనివారం హైదరాబాద్‌లో శాసనమండలి సభ్యులు కసిరెడ్డి నారాయణరెడ్డి చెక్కును అందజేశారు. కార్యక్రమంలో నాయకులు రఘురాములు, మహేందర్‌రెడ్డి, జంగయ్య, సురేందర్‌ తదితరులు పాల్గొన్నారు.logo