గురువారం 13 ఆగస్టు 2020
Nagarkurnool - Aug 02, 2020 , 08:15:55

నిరాడంబరంగా ఈదుల్‌ జుహా

  నిరాడంబరంగా ఈదుల్‌ జుహా

  •  భక్తిశ్రద్ధలతో  ప్రత్యేక ప్రార్థనలు

కల్వకుర్తి రూరల్‌:  త్యాగాలకు ప్రతీక అయిన బక్రీద్‌ పర్వదిన వేడుకలను కల్వకుర్తి మండలంలోని మార్చాల, జీడిపల్లి, పంజుగుల, గుండూరు, రఘుపతిపేట, తర్నికల్‌, తోటపల్లి, ఎల్లికట్ట తదితర  గ్రామాల్లో శనివారం ముస్లింలు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్నారు. పండుగ సందర్భంగా ముస్లింలు నూతన వస్ర్తాలు ధరించి మసీదుల వద్ద భౌతిక దూరాన్ని పాటిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా మత గురువులు బక్రీద్‌ పండుగ విశిష్టతను ముస్లింలకు వివరించారు. అనంతరం అలైబలై పాటించకుండా పరస్పరం పండుగ శుభాకాంక్షలను తెలుపుకొన్నారు.  

వంగూరులో..

వంగూరు: మండలంలోని వివిధ గ్రామాల్లో ముస్లింలు బక్రీద్‌ వేడుకలను  ఘనంగా జరుపుకొన్నారు. కరోనా నేప థ్యంలో ఇంట్లోనే భౌతికదూరం పాటిస్తూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అలింగనాలు చేసుకోకుండా భౌతిక దూరం పాటిస్తూనే పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. వంగూరు మండల కేంద్రంతోపాటు సర్వారెడ్డిపల్లి, కొండారెడ్డిపల్లి, పోల్కంపల్లి, రంగాపూర్‌, కోనాపూర్‌, మిట్టసదగోడు, ఉమ్మాపూర్‌, డిండిచింతపల్లి, నిజాంబాద్‌, పోతారెడ్డిపల్లి తదితర గ్రామాల్లో ముస్లింలు బక్రీద్‌ వేడుకలను  భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.

ఊర్కొండలో..

ఊర్కొండ: శనివారం ఊర్కొండ మండల కేంద్రంతో పాటు మండలంలోని ఊర్కొండపేట,జకినాలపల్లి,జగబోయిన్‌పల్లి,మాధారం,రాచాలపల్లి గ్రామాలతో పాటు పలుగ్రామాలలో ముస్లిం సోదరులు బక్రీద్‌ పండుగను ఘనంగా జరుపుకొన్నారు. మసీదులలో ప్రార్థనలు చేసిన అనంతరం ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలుపుకొన్నారు.


logo