బుధవారం 05 ఆగస్టు 2020
Nagarkurnool - Aug 01, 2020 , 08:52:53

నూర్పిడి కల్లాలతో రైతులకు ప్రయోజనం

నూర్పిడి కల్లాలతో రైతులకు ప్రయోజనం

కల్వకుర్తి రూరల్‌: రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పాటుచేస్తున్న పంట నూర్పిడి కల్లాలతో రైతులకు చాలా ప్రయోజనమని ఈజీఎస్‌ టీఏ మల్లికార్జున్‌, గ్రామ కార్యదర్శి అనురాధ అన్నారు. శుక్రవారం కల్వకుర్తి మండలం తర్నికల్‌ గ్రామంలో గోరటి నిరంజన్‌కు  వ్యవసాయ పొలంలో నూతనంగా మంజూరైన నూర్పిడి కల్లాలకు ముగ్గు పోసి పనులను ప్రారంభించారు. నూర్పిడి కల్లాలతో రైతులు తమ పంటలను తమ పొలాల్లోనే నూర్పిడి చేసుకునే అవకాశం ఉందని ఈ పథకం రైతులకు చాలా ఉపయోగకరమని అన్నారు. కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.logo