మంగళవారం 04 ఆగస్టు 2020
Nagarkurnool - Aug 01, 2020 , 08:52:52

సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

  • n మండల వైద్యాధికారిణి రూప

    చారకొండ: వానకాలంలో సీజనల్‌ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మండల వైద్యాధికారి  రూప అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బందికి అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ వానకాలంలో సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు. కరోనా వైరస్‌ నియంత్రణకు మాస్కులు, భౌతిక దూరం పాటించాలని, పోషకాహారం తీసుకోవాలని అన్నారు. జ్వరం, పొడి దగ్గు, జలుబు, గొంతు నొప్పి తదితర లక్షణాలు కనిపిస్తే వెంటనే ప్రథమ చికిత్స చేసుకోవాలన్నారు. కొవిడ్‌ పరీక్షలు చేసుకోవాలంటే వైద్యులను సంప్రదించాలని చెప్పారు. వ్యాధి లక్షణాలు ఉంటే 14రోజులపాటు క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణ అధికారి ఎన్టీవీ చారి, హెల్త్‌ అసిస్టెంట్‌ మేషక్‌,  వైద్య సిబ్బంది కరుణ, శశికుమార్‌, నాగరాజు, అలివేలు, కల్పన, శకుంతల, కళమ్మ తదితరులు పాల్గొన్నారు.
logo