శనివారం 15 ఆగస్టు 2020
Nagarkurnool - Aug 01, 2020 , 08:52:52

భక్తి శ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతాలు

 భక్తి శ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతాలు

కల్వకుర్తి రూరల్‌: కల్వకుర్తి మండలంలోని ఆయా గ్రామాల్లో శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని భక్తులు వరలక్ష్మీ వ్రతాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్నారు. మహిళలు తమ ఇండ్లను శుభ్ర పర్చుకుని ఉపవాసాలతో వరలక్ష్మీవ్రతాలు నిర్వహించారు. పలువురు మహిళలు గ్రామాల్లోని అమ్మవారి దేవాలయాల్లో సామూహిక అర్చన కార్యక్రమాలు నిర్వహించారు. శ్రావణమాసంలో అమ్మవారిని కొలవడం ద్వారా దారిద్య్రం దూరమై ఐష్టెశ్వర్యాలతో ఇంటిల్లిపాది సంతోషంగా గడుపుతారని, సకల శుభాలు జరుగుతాయని మహిళల నమ్మకం. 


logo