గురువారం 13 ఆగస్టు 2020
Nagarkurnool - Jul 30, 2020 , 04:50:45

కొవిడ్‌పై పూర్తిస్థాయి అవగాహన కలిగి ఉండాలి

కొవిడ్‌పై పూర్తిస్థాయి అవగాహన కలిగి ఉండాలి

  • l డీఎంహెచ్‌వో సుధాకర్‌లాల్‌

నాగర్‌కర్నూల్‌ టౌన్‌: కొవిడ్‌-19పై ప్రజలతోపాటు గ్రామీణ వైద్యులు పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండాలని డీఎంహెచ్‌వో సుధాకర్‌లాల్‌ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని సీఎన్‌రెడ్డి సేవాసదన్‌లో నాగర్‌కర్నూల్‌ డివిజన్‌లోని ఆర్‌ఎంపీ, పీఎంపీలకు కొవిడ్‌-19పై బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. గ్రామీణ వైద్యులు కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ప్రజలకు వైద్య సేవలు అందించాలన్నారు. దగ్గు, జలుబు, జ్వ రం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అనిపిస్తే సమీపంలోని ఆరోగ్య కేంద్రంలో తెలియజేయాలన్నారు. హోమ్‌ ఐసొలేషన్‌లో ఉన్న వారికి ఏ సహాయం అవసరమైనా టోల్‌ఫ్రీ సెంటర్‌ 18005994455ను సంప్రదించాలన్నారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేయొద్దని, బూృణ హత్యలను అరికట్టాలని పిలుపునిచ్చారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. సదస్సులో అదనపు డీఎంహెచ్‌వో వెంకట్‌దాసు, డీఎస్పీ మోహన్‌రెడ్డి, డీఎల్వీవో రామ్మోహన్‌రావు, వైద్యులు దశరథం, నిఖిత, ఎస్సై మాధవరెడ్డి, రెడ్‌క్రాస్‌ కార్యదర్శి రమేశ్‌రెడ్డి, వైద్య అధికారులు, సిబ్బంది, డివిజన్‌ పరిధిలోని ఆర్‌ఎంపీ, పీఎంపీలు పాల్గొన్నారు. logo