బుధవారం 12 ఆగస్టు 2020
Nagarkurnool - Jul 30, 2020 , 04:49:27

మంతటిని హరిత గ్రామంగా తీర్చిదిద్దాలి

మంతటిని హరిత గ్రామంగా తీర్చిదిద్దాలి

  • l పరిశుభ్రతపై అవగాహన పెంచుకోవాలి    
  • l మంతటి గ్రామాన్ని సందర్శించిన కలెక్టర్‌ శర్మన్‌

నాగర్‌కర్నూల్‌ టౌన్‌: మంతటిని హరిత గ్రామంగా తీర్చిదిద్దాలని కలెక్టర్‌ శర్మన్‌చౌహాన్‌  పిలుపునిచ్చారు. పల్లె ప్రగతి పనుల పరిశీలనలో భాగంగా కలెక్టర్‌ మండలంలోని మంతటి గ్రామాన్ని బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలోని పల్లె ప్రకృతి వనంలో మొక్కలు నాటారు. గ్రామాన్ని సంపూర్ణంగా పరిశీలించిన కలెక్టర్‌ పారిశుధ్య లోపం ఉన్న ప్రదేశాలను గుర్తించి వాటిని శు భ్రంగా ఉంచుకోవాలని సూచించారు. వచ్చే వారం నాటికి పూర్తిస్థాయిలో స్వచ్ఛత కనిపించాలన్నారు. స్వచ్ఛత మన జీవన విధానంలో భాగం కావాలని సూచించారు. జిల్లాలో ప్రతి ఇంటికీ సోక్‌ కిట్‌ నిర్మాణం జరిగి వాటిని సమర్థవంతంగా వినియోగించుకోవాలన్నారు. గ్రామంలో అధిక శాతంలో మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. గ్రామం స్వచ్ఛతకు సర్పంచ్‌తోపాటు వార్డు సభ్యులు కృషి చేయాలన్నారు. వారు ప్రతిరోజూ వార్డుల్లో పర్యటిస్తూ పరిశుభ్రతపై ప్రజలకు వివరించాలన్నారు. వీధుల్లో చెత్త వేస్తే భారీస్థాయిలో జరిమానా విధించాలని కలెక్టర్‌ సూచించారు. వర్షపు నీరు భూమిలో ఇంకే విధంగా అనువైన ప్రదేశాన్ని సాంకేతిక అధికారుల సహకారంతో గుర్తించి సామూహిక ఇంకుడుగుంతలు నిర్మించాలని చెప్పారు. అధికంగా జనాభా సంచరించే ప్రదేశాల్లో సామూహిక మరుగుదొడ్డిని జీపీ నిర్మిస్తుందని, నిర్మాణం తర్వాత దాన్ని శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత పంచాయతీదేనన్నారు. పల్లె ప్రకృతి వనంలో వెయ్యి పండ్ల మొక్కలు, మిగతా 3 వేల మొక్కలను నాటి వాటిని సంరక్షించాల్సిన బాధ్యత సర్పంచ్‌, పంచాయతీ కార్యదర్శిదే అన్నారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి జీపీ ట్రాక్టర్‌లో వేయాలని చెప్పారు. అనంతరం పంచాయతీ కార్యాలయంలో హరితహారం, బడ్జెట్‌, ఇతర రికార్డులను పరిశీలించారు. గ్రామంలో నిర్మిస్తున్న శ్మశానవాటిక, డంపింగ్‌యార్డు నిర్మాణాలను పరిశీలించారు. కలెక్టర్‌ వెంట జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి సుధాకర్‌, ఆర్డీవో నాగలక్ష్మి, వ్యవసాయ అధికారి నర్మద, జెడ్పీటీసీ శ్రీశైలం, అధికారులు పాల్గొన్నారు. logo