సోమవారం 10 ఆగస్టు 2020
Nagarkurnool - Jul 29, 2020 , 11:45:13

పేదలకు టీఆర్‌ఎస్‌ సర్కార్‌ అండ

పేదలకు టీఆర్‌ఎస్‌ సర్కార్‌ అండ

కల్వకుర్తి : పేదలకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అండ గా ఉంటుందని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ పేర్కొన్నారు. కల్వకుర్తి నియోజకవర్గం కడ్తాల మండ లం అన్మాస్‌పల్లి గ్రామానికి చెందిన సురేందర్‌, ఆ మనగల్లు పట్టణానికి చెందిన సాయికిరణ్‌, వెంకటేశ్వర కాలనీకి చెందిన నవ్య, కల్వకుర్తి మండలం సుద్దకల్‌ గ్రామానికి చెందిన మల్లేశ్‌, ముకురాల గ్రామానికి చెందిన కృష్ణయ్య, చారకొండ మం డలం జూపల్లి గ్రామానికి చెందిన హసీనా బేగం, ఎర్రపల్లి గ్రామానికి చెందిన బాలమణిలకు మం జూరైన సీఎమ్మార్‌ఎఫ్‌ చెక్కులను మంగళవారం ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ సురేందర్‌కు రూ.24వేలు, సా యికిరణ్‌కు రూ.24 వేలు, నవ్యకు రూ.16 వేలు, మల్లేశ్‌కు రూ.1.25లక్షలు, కృష్ణయ్యకు రూ.38, 500, బాలమణికి రూ.10 వేలు మంజూరయ్యాయన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, టీ ఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

చెక్కు అందజేసిన ఎమ్మెల్సీ 

పాలమూరు జిల్లాకు చెందిన శ్రీనివాస్‌కు సీ ఎం రిలీఫ్‌ఫండ్‌  నుంచి మంజూరైన రూ.44, 500 చెక్కును మంగళవారం ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అందజేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

చెర్కూర్‌ గ్రామానికి చెందిన మహిళకు..

వెల్దండ : మండలంలోని చెర్కూర్‌ గ్రామానికి చెందిన సునీత వైద్య ఖర్చుల కోసం సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి మంజూరైన రూ.60వేల చెక్కును మంగళవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో ఎమ్మెల్సీ అందజేశారు. ఆపదలో ఉన్న పేదలకు సీఎం సహాయ నిధి కొండంత అండ అని ఎమ్మెల్సీ తెలిపారు. 


logo