గురువారం 06 ఆగస్టు 2020
Nagarkurnool - Jul 28, 2020 , 04:39:54

పురుగుల మందు తాగి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

పురుగుల మందు తాగి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

నాగర్‌కర్నూల్‌ క్రైం: పురుగుల మందు తాగి ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన పెద్దకొత్తపల్లి మండలం దేవినేనిపల్లిలో చోటుచేసుకున్నది. స్థానికుల కథనం మేరకు.. కుటుంబ సభ్యులతో మనస్పర్థల కారణంగా గ్రామానికి చెందిన విద్యార్థిని శిరీష సోమవారం రాత్రి పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు కారులో నాగర్‌కర్నూల్‌లోని దవాఖానకు తరలిస్తుండగా దేశిటిక్యాల వద్ద కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న మరో ఇద్దరు బాలమషి, అలివేల తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు వారిని నాగర్‌కర్నూల్‌ ఏరియా దవాఖానకు తరలించగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. logo