బుధవారం 12 ఆగస్టు 2020
Nagarkurnool - Jul 28, 2020 , 04:39:52

పాలమూరు ప్రాజెక్టు పనులు పరిశీలన

పాలమూరు ప్రాజెక్టు పనులు పరిశీలన

  • ప్రగతిపై కలెక్టర్‌ శర్మన్‌ చౌహాన్‌ ఆరా

కొల్లాపూర్‌: మండలంలో నిర్మాణం లో ఉన్న పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనుల ప్రగతిని నాగర్‌కర్నూల్‌ జిల్లా కలెక్టర్‌ ఎల్‌ శర్మన్‌చౌహాన్‌ సోమవారం మధ్యాహ్నం పరిశీలించారు. ప్రాజెక్టులోని మొద టి ప్యాకేజీలో సర్జ్‌ఫూల్‌, పంప్‌హౌస్‌ నిర్మించే వేపలచెరువు ప్రాం తంలో పనులను ఆయన పరిశీలిం చారు. ఇక్కడి నుంచి సున్నపుతండా సమీపంలోని ప్యాకేజీ-2 లో  మెయిన్‌ ఓపెన్‌ కెనాల్‌పై ని ర్మించిన హెడ్‌రెగ్యులేటర్‌ను, కుడికిళ్ల శివారులో ఇదే కాలువను తవ్వకుండ అభ్యంతరాలు వ్యక్తం చేసిన రైతుల భూములను, ప్రాజెక్టు నమూనాను మ్యాప్‌ ద్వారా ఈఈ శ్రీనివాస్‌రెడ్డి కలెక్టర్‌కు వివరించారు. తిర్నాంపల్లి వద్ద ప్యాకేజీ-3లో తవ్విన ప్రధాన కెనాల్‌ను కూడా పరిశీలించారు. కొల్లాపూర్‌ మండలంలో జరుగుతున్న పీఆర్‌ఎల్‌ఐ ప్రాజెక్టు పనుల ప్రగతి పరిశీలనకు త్వరలో సీఎం ముఖ్య కార్యదర్శి స్మితాసబర్వాల్‌ రానున్నారని తెలిసింది. అందు లో భాగంగానే కలెక్టర్‌ శర్మన్‌చౌహాన్‌  పరిశీలన జరిపారని సమాచారం. కలెక్టర్‌ వెంట డీఈ ప్రవీణ్‌కుమార్‌, ఏఈలు ఉన్నారు.logo