శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
Nagarkurnool - Jul 27, 2020 , 05:03:39

ఆటోను ఢీకొన్న బైక్‌

ఆటోను ఢీకొన్న బైక్‌

నలుగురికి గాయాలు

కల్వకుర్తి రూరల్‌: ఆటోను బైక్‌ ఢీకొనగా నలుగురికి గాయాలైన సంఘటన మండలంలోని లింగసానిపల్లి గ్రామ సమీపంలో ఆదివారం చోటు చేసుకున్నది. కల్వకుర్తి ఎస్సై మహేందర్‌ కథనం ప్రకారం.. రఘుపతిపేటకు చెందిన కృష్ణయ్య ఆటోలో ముగ్గురు ప్రయాణికులతో కల్వకుర్తి వైపు వెళ్తున్నారు. ఈక్రమంలో లింగసానిపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు రాఘవేందర్‌గౌడ్‌, శివ బైక్‌పై వస్తూ ఎదురుగా వస్తున్న ఆటోను ప్రమాదవశాత్తు ఢీకొట్టారు. ఈ ఘటనలో రాఘవేందర్‌గౌడ్‌, శివ, కృష్ణయ్యలతోపాటు మరో వ్యక్తికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను కల్వకుర్తి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అదేవిధంగా ఆటో, బైక్‌ను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తునట్లు ఎస్సై తెలిపారు.logo