సోమవారం 10 ఆగస్టు 2020
Nagarkurnool - Jul 27, 2020 , 05:02:58

పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

  • l సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి

కల్వకుర్తి: పేదల సంక్షేమం కోసమే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అహర్నిషలు పనిచేస్తున్నదని ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి పేర్కొన్నారు. కల్వకుర్తి నియోజకవర్గం మాడ్గుల మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన జంగమ్మ, కడ్తాల మండలం మక్త మాధారం గ్రామానికి చెందిన శ్రీనివాస్‌ అనారోగ్యానికి గురై వైద్య సహాయం కోసం సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకున్నారు. ఎమ్మెల్సీ కశిరెడ్డి సహకారంతో జంగమ్మకు రూ.48వేలు, శ్రీనివాస్‌కు రూ.49,500 సీఎంఆర్‌ఎఫ్‌ నుంచి మంజూరయ్యాయి. అందుకు సంబంధించిన చెక్కులను హైదరాబాద్‌లో బాధితులకు ఆదివారం ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి అందజేశారు. కార్యక్రమంలో వివిధ మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.logo