సోమవారం 10 ఆగస్టు 2020
Nagarkurnool - Jul 27, 2020 , 05:00:36

బీచుపల్లిలో అస్థికల కలకలం

బీచుపల్లిలో అస్థికల కలకలం

  • l  నాలుగు మృతదేహాలకు సంబంధించి..
  • l భయబ్రాంతులకు గురైన భక్తులు 

ఇటిక్యాల : బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని పుష్కఘాట్‌ వద్ద ఆదివారం నాలుగు మృతదేహాలకు సంబంధించిన అస్థికలు కనిపించడంతో నదిలో స్నానానికి వచ్చిన భక్తులు భయభాంత్రులకు గురైయ్యారు.తెల్లటి గుడ్డలో మూట గట్టి వాటిపై పేర్లను రాసి మరీ నదిలో జారవిడిచినట్లు ఆనవాలు అగుపించాయి. పుర్రెలు, పెద్ద ఎముకలు, అన్ని కలిపి మూటచుట్టి రెండు అగుపించగా మరికొన్ని మూటలో విడిపోయి పుష్కరఘాట్‌ మెట్లపై చెల్లాచెదురుగా ఉన్నాయి. మెట్లపై భయానకంగా కనిపించిన పుర్రెలు, ఎముకలను చూసి నదిలో స్నానానికి వెళ్లడానికి భక్తులు భయాందోళనకు గురయ్యారు. నీటి ప్రవాహం పైమెట్ల వరకు ఉన్నప్పుడు ఎవరో వీటిని నదిలో జారవిడిచారని ఈరోజు నీటిమట్టం పూర్తిగా తగ్గిపోవడంతోఎముకలు పుర్రెలు బయటపడ్డాయని స్థానిక జాలర్లు అంటున్నారు. ఈ విషయంపై ఇటిక్యాల ఎస్సై సత్యనారాయణ మాట్లాడుతూ కర్ణాటక రాష్ర్టానికి చెందిన వారు నిమజ్జనం చేసిన శవాలు నదీ ప్రవాహంలో కొట్టుకు వచ్చాయని తెలిపారు. logo