సోమవారం 03 ఆగస్టు 2020
Nagarkurnool - Jul 26, 2020 , 07:23:29

పేదల ఆరోగ్య సంరక్షణకు పెద్దపీట

పేదల ఆరోగ్య సంరక్షణకు పెద్దపీట

సీఎమ్మార్‌ఎఫ్‌ చెక్కు పంపిణీ చేసిన ఎమ్మెల్సీ కసిరెడ్డి 

కల్వకుర్తి : పేదల ఆరోగ్య సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి పేర్కొన్నారు. మున్సిపాలిటీలోని జయప్రకాశ్‌నగర్‌ తండాకు చెందిన బీ వెంకటయ్య, కడ్తాల మండల కేంద్రానికి చెందిన మహిమాన్విత్‌లకు మంజూరైన సీఎమ్మార్‌ఎఫ్‌ చెక్కులను హైదరాబాద్‌లో ఎ మ్మెల్సీ కసిరెడ్డి పంపిణీ చేశారు. వెంకటయ్యకు రూ.48వేలు, మహిమాన్విత్‌ కు రూ.20వేలు మంజూరైనట్లు ఎమ్మెల్సీ తెలిపారు. కార్యక్రమంలో హన్మానాయక్‌, యాదగిరిరెడ్డి, మోత్యానాయక్‌, కృష్ణ, శేఖర్‌, రాములు, శ్రీకాంత్‌రెడ్డి, సుమన్‌గౌడ్‌, మల్లేశ్‌, రాజు పాల్గొన్నారు.

బాధిత కుటుంబానికి పరామర్శ

ఆమనగల్లు మండలం ఎక్వాయిపల్లికి మాజీ సర్పంచ్‌ భాస్కర్‌రెడ్డి కుటుంబాన్ని ఎమ్మెల్సీ కసిరెడ్డి పరామర్శించారు. భాస్కర్‌రెడ్డి కుమారుడు సతీశ్‌రెడ్డి ఆకస్మికంగా మరణించిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ బాధిత కుటుంబాన్ని ఓదార్చారు. అలాగే చారకొండ మండలం జూపల్లి గ్రామ మాజీ ఎంపీటీసీ నూర్‌పాల్‌పాయక్‌ కుటుంబాన్ని పరామర్శించారు. నూర్‌పాల్‌ తండ్రి రతన్‌సింగ్‌ మృతిచెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ కసిరెడ్డి రతన్‌సింగ్‌ భౌతికకాయంపై పూలమాల వేసి నివాళులర్పించారు.


logo