మంగళవారం 11 ఆగస్టు 2020
Nagarkurnool - Jul 26, 2020 , 07:22:31

పెండింగ్‌ పనులు పూర్తి చేయాలి

పెండింగ్‌ పనులు పూర్తి చేయాలి

  • భూసేకరణకు రూ.13 కోట్లు మంజూరు
  • ఎంజీకేఎల్‌ఐపై ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ సమీక్ష

కల్వకుర్తి : మండలంలోని ఎల్లికట్ట నుంచి జంగారెడ్డిపల్లి వరకు పెండింగ్‌లో ఉన్న ఎంజీకేఎల్‌ఐలో అంతర్భాగమైన 29వ ప్యాకేజీ డిస్ట్రిబ్యూటరీ కాలువలను వేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ సూచించారు. 40 వేల ఎకరాలకు సాగునీరందించేందుకు జంగారెడ్డిపల్లి నుంచి ఎంజీకేఎల్‌ఐ ప్రధాన కాలువకు అనుబంధంగా ఏర్పాటు చేసిన డీ-82 కాలువ పనుల్లోని అడ్డంకులను తొలగించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 29వ ప్యాకేజీలోని డిస్ట్రిబ్యూటర్లు, డీ-82 కాలువ పెండింగ్‌ పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ డీ-82లో భాగంగా వెల్దండ మండలం భర్కత్‌పల్లి వద్ద పనులు పెండింగ్‌లో ఉన్నాయని, ఇవి పూర్తి అయితేనే మాడ్గుల మండలం నాగిళ్ల వరకు సాగునీరందుతుందన్నారు. వెంటనే సమస్యను పరిష్కరించి పనులు ప్రారంభించాలని సూచించారు. కాల్వలో భూములు కోల్పోయిన రైతులకు రూ.13 కోట్లు మంజూరైన క్రమంలో, రైతుల నుంచి ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలన్నారు. ఈ వానకాలం సాగునాటికి మాడ్గుల మండలం నాగిళ్ల వరకు నీటిని అందజేయాలన్నారు. అవకాశం ఉన్న ప్రతి చెరువును కృష్ణా జలాలతో నింపాలని చెప్పారు. సమావేశంలో సీఈ అనంత్‌రెడ్డి, ఎస్‌ఈ అంజయ్య, ఈఈ శ్రీకాంత్‌, డిప్యూటీ ఈఈ దేవన్న, షర్మిల, ఏఈఈ చంద్రకాంత్‌, లలిత, శశికళ, ఏఈలు ఇఫ్తాకార్‌, విశ్వనాథ్‌, గుత్తేదారు సూర్యనారాయణరాజు తదితరులు పాల్గొన్నారు.


logo