శుక్రవారం 14 ఆగస్టు 2020
Ashoka Developers
Nagarkurnool - Jul 26, 2020 , 07:21:19

అన్నదాతలను అన్ని విధాలుగా ఆదుకుంటున్నాం : ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌

అన్నదాతలను అన్ని విధాలుగా ఆదుకుంటున్నాం : ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌

ఎంజీకేఎల్‌ఐ డీ-82 కాల్వ పనుల పరిశీలన

వెల్దండ : రైతులకు రాష్ట్ర ప్రభుత్వం భరోసా కల్పిస్తున్నదని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ పేర్కొన్నారు. శనివారం మండలంలోని చెర్కూర్‌ గ్రామ శివారులో  ఎంజీకేఎల్‌ఐ డీ-82 కాల్వ ప నులను పరిశీలించారు. అధికారులు, కాంట్రాక్టర్లకు పలుసూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగునీరందించమే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారన్నారు. ఉమ్మడి జిల్లాలో 30 ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్న  ప్రాజెక్టులను పూర్తి చేసి సాగు నీరందిస్తున్న ఘ నత ముఖ్యమంత్రిదేనన్నారు. రైతులను అన్ని విధాలా ఆ దుకుంటున్నామని చెప్పారు. డీ-82 కాల్వ ద్వారా మాడ్గుల మండలం నాగిళ్ల వరకు అతి త్వరలో  సాగునీరందిస్తామన్నారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు భూపతిరెడ్డి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు సంజీవ్‌,  సీఈ అనంత్‌రెడ్డి, ఎస్‌ఈ అంజయ్య, డిప్యూటీ ఈఈ ష ర్మిల, ఏఈ చంద్రకాంత్‌  తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి

కల్వకుర్తి : అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ సూచించారు. శనివారం నియోజకవర్గంలోని కడ్తాల మండలం చల్లంపల్లి గ్రామంలో డంపింగ్‌ యా ర్డు, మిల్క్‌ చిల్లింగ్‌ సెంటర్‌ పనులు పరిశీలించారు. వేగవంతంగా పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలన్నారు. అనంతరం బాధితులకు సీఎమ్మార్‌ఎఫ్‌ చెక్కులు పంపిణీ చేశారు. కడ్తాల మండలం చల్లంపల్లి గ్రామానికి చెందిన వెం కటమ్మకు రూ.13,500, శ్రీనివాస్‌కు రూ.13 వేలు, తలకొండపల్లి పట్టణానికి చెందిన పెంటయ్యలకు రూ. 20 వేలు సీఎమ్మార్‌ఎఫ్‌ నుంచి మంజూరయ్యాయి. కార్యక్రమంలో సర్పంచులు కృ ష్ణయ్య, ఎల్‌ఎన్‌రెడ్డి, ఉప సర్పంచులు జైపాల్‌రెడ్డి, రామకృష్ణ, పీఏసీసీఎస్‌ చైర్మన్‌ వెంకటేశ్‌, నాయకు లు హరిచంద్‌, నర్సింహ, అలీ, శ్రీను, వెంకటేశ్‌, నారాయ ణ, జంగయ్య, రమేశ్‌, తిరుపతి, శంకర్‌, రాజేందర్‌, ప్రవీ ణ్‌, రాములుగౌడ్‌ పాల్గొన్నారు.

బాధిత కుటుంబానికి పరామర్శ

చారకొండ : మండలంలోని చంద్రాయన్‌పల్లి మాజీ స ర్పంచ్‌ భాస్కర్‌రెడ్డి అనారోగ్యంతో కొన్ని రోజుల కిందట మృతి చెందాడు. ఈ క్రమంలో శనివారం ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. మృతుడి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సం దర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మృతుడి మరణం పార్టీకి తీరని లోటన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ నిర్మల, చారకొండ, వెల్దండ సింగిల్‌విండో అధ్యక్షుడు గురువయ్యగౌడ్‌, భాస్కర్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ బక్కమ్మ, ఎంపీటీసీ శ్రీనివాస్‌రె డ్డి, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు యాదయ్యగౌడ్‌, ఎర్రవెల్లి సర్పంచ్‌ సాయికుమార్‌, నాయకులు పాల్గొన్నారు. 


logo