సోమవారం 10 ఆగస్టు 2020
Nagarkurnool - Jul 26, 2020 , 07:17:56

రహత్‌నగర్‌ ముస్లిం అడ్వైజరీ కమిటీ ఎన్నిక

రహత్‌నగర్‌ ముస్లిం అడ్వైజరీ కమిటీ ఎన్నిక

నాగర్‌కర్నూల్‌ టౌన్‌: జిల్లా కేంద్రంలోని రహత్‌నగర్‌ కాలనీలో శనివారం కాలనీ ముస్లిం అడ్వైజరీ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా మాజీ వార్డు సభ్యుడు ఎండీ హసన్‌, ఉపాధ్యక్షుడిగా అబ్దుల్‌ మజీద్‌ఖాన్‌, కార్యదర్శిగా యూబ్‌ఖాన్‌, సంయుక్త కార్యదర్శిగా ఎండీ యూసూఫ్‌, కోశాధికారిగా ఎండీ ఇసాక్‌, న్యాయ సలహాదారుగా అబ్ధుల్‌ హమీద్‌, సభ్యులుగా ఎండీ సలీమ్‌, ఎండీ మోసిన్‌, ఎండీ ముంతాజ్‌ ఎన్నికయ్యారు. అనంతరం కార్యవర్గాన్ని పూలమాల, శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో కౌన్సిలర్‌ ఖాజాఖాన్‌, ముస్లిం యూత్‌ అడ్వైజరీ కమిటీ అధ్యక్షుడు సయ్యద్‌ జావీద్‌, ముస్లిం సంఘాల నాయకులు అష్రాఫ్‌, ముబీన్‌ఖాన్‌, అహ్మద్‌, రహీమ్‌, మహమూద్‌ తదితరులు పాల్గొన్నారు. 


logo