శుక్రవారం 14 ఆగస్టు 2020
Nagarkurnool - Jul 26, 2020 , 07:16:32

పురుగుల మందు తాగి యువకుడు మృతి

పురుగుల మందు తాగి యువకుడు మృతి

నాగర్‌కర్నూల్‌ క్రైం: ఓ యువకుడు పురుగుల మందు తాగి మృతిచెందిన ఘటన మండలంలోని మల్కాపూర్‌లో చోటు చేసుకున్నది. ఏఎస్సై బాలనారాయణ కథనం మేరకు.. గ్రామానికి చెందిన గజ్జల రవీందర్‌(30) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడని, కొన్నిరోజులుగా కడుపు నొప్పి, ఆర్థిక ఇబ్బందులతో పురుగుల మందు తాగాడని తెలిపారు. గమనించిన చుట్టుపక్కల వారు నాగర్‌కర్నూల్‌ ప్రభుత్వ దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించినట్లు తెలిపారు. భార్య గజ్జల మంగమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


logo