సోమవారం 10 ఆగస్టు 2020
Nagarkurnool - Jul 25, 2020 , 05:35:19

ఇష్టపడి చదివి ఉన్నతంగా రాణించాలి

ఇష్టపడి చదివి ఉన్నతంగా రాణించాలి

  • పాఠ్య పుస్తకాల పంపిణీలో జెడ్పీటీసీ భరత్‌ ప్రసాద్‌

   కల్వకుర్తి/కల్వకుర్తి రూరల్‌/చారకొండ/వంగూరు: విద్యార్థులు పాఠ్యాంశాలను కష్టపడి కాకుండా ఇష్టపడి చదివి ఉన్నతంగా రాణించాలని కల్వకుర్తి జెడ్పీటీసీ భరత్‌ప్రసాద్‌ విద్యార్థులకు సూచించారు. శుక్రవారం కల్వకుర్తి మండలం గుండూరు గ్రామంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో హెచ్‌ఎం శ్రీలత ఆధ్వర్యంలో జెడ్పీటీసీ సభ్యుడు భరత్‌ప్రసాద్‌, ఎంపీటీసీ నర్సిరెడ్డి, సర్పంచ్‌ కిష్టారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను పంపిణీ చేశారు. పాఠశాల విద్యార్థులకు షూ, టై, బెల్టులను  అందిస్తానని జెడ్పీటీసీ, నోటు పుస్తకాలను సంయుక్తంగా అందిస్తామని ఎంపీటీసీ నర్సిరెడ్డి, సర్పంచ్‌ కిష్టారెడ్డి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంఈవో బాసునాయక్‌,  ఎస్‌ఎంసీ చైర్మన్లు, వనిత, మంజుల, పీఎస్‌ హెచ్‌ఎం లక్ష్మీబాయి, ఉపాధ్యాయులు వెంకటయ్య, రాజు, రమేశ్‌, మాధవీలత, ధర్మేందర్‌, శ్రీనివాసులు తదితరులు ఉన్నారు. అదేవిధంగా మండలంలోని ముకురాల గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో హెచ్‌ఎం రామేశ్వర్‌ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు గ్రామ సర్పంచ్‌ నరేందర్‌రెడ్డి, ఎంపీటీసీ నర్సిరెడ్డి, ఎస్‌ఎంసీ చైర్మన్‌ సంతోష్‌ అందించారు.

చారకొండ  మండల కేంద్రంలో జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు  పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ విజేందర్‌గౌడ్‌, జీహెచ్‌ఎం శంకర్‌నాయక్‌, సింగిల్‌ విండో అధ్యక్షుడు జెల్ల గురువయ్యగౌడ్‌, ఎస్‌ఎంసీ చైర్మన్‌ లెనిన్‌బాబు, రాఘవేందర్‌, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. వంగూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఎంపీపీ భీమమ్మ పుస్తకాలను అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ లావణ్య, జెడ్పీ కోఆప్షన్‌ సభ్యుడు హమీద్‌, ఎంఈవో శంకర్‌నాయక్‌, నేతలు లాలూయాదవ్‌, ఎల్లాగౌడ్‌తోపాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కల్వకుర్తి మండలం బెక్కెర గ్రామ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. దాత శ్రీధర్‌రెడ్డి విద్యార్థులకు మాస్కులు, నోటు పుస్తకాలు, పెన్నులు అందించారు. దాతను గ్రామస్తులు అభినందించారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ గోవర్ధన్‌, సర్పంచ్‌ పాండురంగారెడ్డి, ఉప సర్పంచ్‌ పార్వతమ్మ, ఎస్‌ఎంసీ చైర్‌పర్సన్‌ భాగ్యశ్రీ, హెచ్‌ఎం రఘురాం, శ్రీధర్‌రెడ్డి, కిరణ్‌, విద్యాకమిటీ సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.


logo