మంగళవారం 11 ఆగస్టు 2020
Nagarkurnool - Jul 25, 2020 , 05:34:23

పేదలకు అండగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం

పేదలకు అండగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం

కల్వకుర్తి:  టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పేద ప్రజలకు అండగా ఉంటుందని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ అన్నారు. కల్వకుర్తి నియోజకవర్గం కడ్తాల మండ లం అన్మాస్‌పల్లి గ్రామానికి చెందిన లక్ష్మమ్మ అనారోగ్యానికి గురై వైద్య  సహాయం కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకుంది. ఎమ్మె ల్యే జైపాల్‌యాదవ్‌ సహకారంతో లక్ష్మమ్మ రూ.60 వేలు మంజూరయ్యా యి.శుక్రవారం హైదరాబాద్‌లో లక్ష్మమ్మ వైద్యం కోసం సీఎం సహాయనిధి నుంచి మంజూరైన రూ.60 చెక్కును బాధితురాలి కుమారుడు పరమేశ్‌కు ఎమ్మెల్యే అందజేశారు. కార్యక్రమంలో  టీఆర్‌ఎస్‌ నాయకుల జయప్రకాశ్‌, వెంకటయ్య, నాగులు, భాస్కర్‌రావు, గణేశ్‌, బాలేమియా, లాయక్‌అలీ, నాగేశ్‌ పాల్గొన్నారు.

వెల్దండలో అనాథలకు బియ్యం పంపిణీ 

  •  కేటీఆర్‌పై అభిమానం చాటుకున్న యువనేత యాదగిరి

వెల్దండ:  మంత్రి కేటీఆర్‌ జన్మదినాన్ని  టీఆర్‌ఎస్‌ యువజన నాయకుడు జంగిలి యాదగిరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యాదగిరి తన సొంత ఖర్చుతో ఒక్కో అనాథ కుటుంబానికి 25 కిలోల చొ ప్పున సమకూర్చిన బియ్యాన్ని సర్పంచ్‌ భూపతిరెడ్డితో కలిసి అందజేశా రు. ఈ  సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపదలో ఉన్నవారిని అక్కున చేర్చుకునే మహా నాయకుడని ఆయన అభిమానిని అయినందుకు గర్విస్తు న్నానన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ నిరంజన్‌, గజిని శ్రీను, ప్రసాద్‌, రాజు, సందీప్‌ ఉన్నారు.logo