శనివారం 15 ఆగస్టు 2020
Nagarkurnool - Jul 25, 2020 , 05:32:27

లెక్క తేల‌నుంది

లెక్క తేల‌నుంది

  • పంటల వివరాలను సేకరిస్తున్న అధికారులు
  • ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు
  • కొనుగోలు కేంద్రాలకు మార్గం సుగమం
  •  ఈ నెలాఖరు వరకు  పూర్తి చేసేలా ప్రణాళికలు
  •  ఉమ్మడి జిల్లాలో 8.31 లక్షల మంది రైతులు
  •  19.24 లక్షల ఎకరాల్లో సాగు అంచనా

పంటల లెక్క తేలనున్నది.. ఏయే రైతులు, ఎన్ని రకాల పంటలు, ఎంత విస్తీర్ణంలో సాగు చేశారు..?, అనే వివరాలను వ్యవసాయ శాఖ సేకరిస్తున్నది.. ఈ నెలాఖరులోగా పూర్తి చేసి ప్రభుత్వానికి సమగ్ర నివేదికను అందించనున్నారు.. రైతులు సాగు చేసిన పంటల వివరాలపై స్పష్టత వచ్చేందుకు వివరాలను లెక్కిస్తున్నారు.. దీంతో ధాన్యం చేతికి వచ్చే సమయానికి ఎన్ని కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలోననే విషయాలపై ప్రభుత్వం చర్యలు చేపట్టేందుకు మార్గం సుగమం కానున్నది..

- నాగర్‌కర్నూల్‌, నమస్తే తెలంగాణ

రైతులు సాగు చేసిన పంటల వివరాలను వ్యవసాయ శాఖ సేకరిస్తున్నది. వానకాలంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 8.31 లక్షల మంది రైతులు 19.24 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నట్లుగా వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా. ఈ సీజన్‌లో ప్రభుత్వం నియంత్రిత సాగు విధానం అమలు చేస్తున్నది. గతేడాదికి భిన్నంగా మొక్కజొన్న పంటకు బదులు కంది సాగు చేయాలని వ్యవసాయ శాఖ విస్తృతంగా అవగాహన కల్పించింది. ఈ క్రమంలో పంటల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. దీంతో పంటలు చేతికి వచ్చే సమయానికి ఏయే పంటలు, ఎంత దిగుబడి వ స్తాయోననే అంశాలపై ప్రభుత్వం వద్ద పూర్తి వివరాలు ఉండనున్నాయి. ఉమ్మడి పాలమూరులో వ్యవసాయ శాఖ అంచనాల ప్రకారం అత్యధికం గా పత్తి 9.50లక్షల ఎకరాల్లో సాగవనున్నది. ఆ తర్వాతి స్థానంలో వరి 3,76,519 ఎకరాల్లో, కం ది 3,76,456 ఎకరాల్లో సాగు చేయనున్నట్లు అంచనా రూపొందించారు. నియంత్రిత పద్ధతితో మొక్కజొన్న స్థానాన్ని కంది ఆక్రమించింది. ప్ర భుత్వం పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేయడంతో పాటు గతంలో ఉన్న జూరాల, నెట్టెంపాడు, కో యిల్‌సాగర్‌, భీమా, ఎంజీకేఎల్‌ఐ వంటి ప్రాజెక్టులతో అంచనాకు మించి సాగవనుండడంతో దిగుబడులూ గణనీయంగా రానున్నాయి. 

రాష్ట్ర ప్రభుత్వం ఐదేండ్లుగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తూ రైతులను ఆదుకుంటోంది. అయితే మద్దతు ధర అనుకున్నంతగా అందడం లేదు. దీనికి కారణం.. రైతులు మార్కెట్‌కు తీసుకొచ్చే ధాన్యం దిగుబడులపై స్పష్టత లేకపోవడమే. ఇటీవల కరోనాతో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సీఎం కేసీఆర్‌ ఆదేశంతో ప్రభుత్వం రూ.వేయి కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేసింది. గత సీజన్‌లో 3.57 లక్షల ఎకరాల్లో వరి సాగు చే యగా 5.32 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి వ చ్చింది. ఈ వానకాలంలోనూ గణనీయంగా దిగుబడి వచ్చే అవకాశం ఉండటంతో ప్రభుత్వం పం టల లెక్కను పక్కాగా సేకరించేందుకు నిర్ణయించింది. దీంతో వ్యవసాయ శాఖ అధికారులు గ్రా మాల వారీగా పంటల వివరాలను నమోదు చేస్తున్నారు. ఏ రైతు ఎన్ని ఎకరాల్లో, ఏయే రకాల పం టలు వేశారోననే వివరాలను ఏఈవోల ద్వారా సే కరించి ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేస్తున్నారు. ఏ రోజుకారోజు వివరాలను రాష్ట్ర కార్యాలయానికి చేరవేస్తున్నారు. ఈ నెలాఖరు వరకు పంటల లెక్కల సేకరణను పూర్తి చేయనున్నారు. దీని ఆధారంగా ఎన్ని కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలనే అంశంపై ప్రభుత్వానికి స్పష్టత వస్తుంది. ఫలితం గా రైతులు పంటలను అమ్ముకునేందుకు ఇబ్బందులు కలగకూడదనేదే ప్రభుత్వ ఉద్దేశం. 

నెలాఖరులోగా పూర్తి..

జిల్లాలోని అన్ని గ్రామాల్లో పంటల సాగు లెక్కలను సేకరిస్తున్నాం. ఏఈవోలు 143 క్లస్టర్ల పరిధిలో ప్రతి రైతు ఎన్ని ఎకరాల్లో పంటలు వేశారు..? ఏయే పంటలు వేశారు..? అనే పూర్తి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నాం. పంటలు చేతికి వచ్చే సమయంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ఈ కార్యక్రమం చేపడుతున్నాం. రైతులంతా తప్పనిసరిగా తమ పంటల వివరాలను ఏఈవోలకు అందజేయాలి. 

- వెంకటేశ్వర్లు, డీఏవో, నాగర్‌కర్నూల్‌

ఉమ్మడి జిల్లాలో రైతులు, పంటల అంచనా

జిల్లా రైతులు      సాగు అంచనా

నాగర్‌కర్నూల్‌            1,26,549    5,62,299 

నారాయణపేట  1,38,267    4,64,440

జోగుళాంబ గద్వాల 2.58,901    3,40,677

మహబూబ్‌నగర్‌      1,76,474    3,21,512

వనపర్తి                1,30,894    2,35,250

మొత్తం              8,31,085      19,24,178

తాజావార్తలు


logo