సోమవారం 03 ఆగస్టు 2020
Nagarkurnool - Jul 02, 2020 , 01:53:23

జూరాలకు స్వల్పంగా పెరిగిన వరద

జూరాలకు స్వల్పంగా పెరిగిన వరద

ఇన్‌ఫ్లో 4,476 క్యూసెక్కులు l అవుట్‌ఫ్లో 66క్యూసెక్కులు

ధరూరు: ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో ప్రధాన ప్రాజెక్ట్‌ ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్‌కు స్వల్పంగా వరద కొనసాగుతున్నది. బుధవారం సాయంత్రానికి ప్రాజెక్ట్‌ ఇన్‌ఫ్లో 4476 క్యూసెక్కులకుగానూ 66క్యూసెక్కులు అవుట్‌ ఫ్లో నమోదైంది. ప్రాజెక్ట్‌ పూర్తి నీటినిల్వ సామర్థ్యం 9.66టీఎంసీలకు ప్రస్తుతం 5.24టీఎంసీలలో నీరు నిల్వ ఉంది. ఎగువన ఆల్మట్టి ప్రాజెక్ట్‌లో 12,333 క్యూసెక్కుల ఇన్‌ఫ్లోతో 1,130 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో నమోదు కాగా, ప్రాజెక్ట్‌ పూర్తి నీటి సామర్థ్యం 129.72 టీఎంసీలకుగానూ 70.33టీఎంసీల నీరు నిల్వ ఉంది. నారాయణపూర్‌ ప్రాజెక్ట్‌ 37.64 టీఎంసీల నీటి సామర్థ్యానికి 24.84టీఎంసీల స్థాయిలో నీరు నిల్వ ఉంది. ఇన్‌ఫ్లో 1,716 క్యూసెక్కులకు 25క్యూసెక్కుల నీరు అవుట్‌ఫ్లోగా నమోదు అయింది.logo