సోమవారం 10 ఆగస్టు 2020
Nagarkurnool - Jul 02, 2020 , 01:51:37

రైతును రాజు చేయడమే లక్ష్యం

రైతును రాజు చేయడమే లక్ష్యం

  • అన్నదాతలకు మేలు చేసేందుకే రైతు వేదికలు : ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌   
  • తాండ్ర, ఆకుతోటపల్లి గ్రామాల్లో రైతువేదిక భవన నిర్మాణాలకు భూమిపూజ 

కల్వకుర్తి/రూరల్‌ : రైతును రాజు చేయడమే ల క్ష్యంగా సీఎం కేసీఆర్‌ ముందుకు వెళ్తున్నారని ఎ మ్మెల్యే జైపాల్‌యాదవ్‌ పేర్కొన్నారు. బుధవారం కల్వకుర్తి మండలం తాండ్ర, ఆమనగల్లు మండ లం ఆకుతోటపల్లి గ్రామాల్లో జెడ్పీ వైస్‌చైర్మన్‌ బా లాజీసింగ్‌, జెడ్పీటీసీలు భరత్‌ప్రసాద్‌, అనురాధలతో కలిసి రైతు వేదిక భవన నిర్మాణాలకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్నదాతలకు మరింత అండగా నిలవడం లో రైతు వేదికలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. తాము పండించిన పంటకు రైతులే ధ ర నిర్ణయించుకునేందుకు ఈ వేదికలు దోహదపడుతాయన్నారు. రైతులకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అండగా ఉందన్నారు. రైతుబంధు, రుణమాఫీ, గి ట్టుబాటు ధరకు ధాన్యం కొనుగోలు వంటి పథకా లే ఇందుకు ఉదాహరణలని పేర్కొన్నారు. ప్రస్తు తం రైతులకు సంబంధించి రాష్ట్రంలో స్వర్ణయు గం నడుస్తుందని చెప్పారు. సగర్వంగా రైతులమ ని చెప్పుకునే స్థాయికి తీసుకువచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. తాండ్ర గ్రామంలో రైతువేదిక నిర్మాణానికిగానూ 500 గజాల స్థలం దానం చే సిన రైతు భగవాన్‌రెడ్డిని ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధు లు సన్మానించారు. అనంతరం తాండ్ర గ్రా మంలో సర్పంచ్‌ సుశీల ఆధ్వర్యంలో రైతువేదిక భవన నిర్మాణం వద్ద మొక్కలు నాటారు. కార్యక్రమంలో సింగిల్‌ విండో అధ్యక్షుడు జనార్దన్‌రెడ్డి, వెంకటేశ్‌, ఎంపీపీలు అనిత, సునిత, మార్కెట్‌ క మిటీ చైర్మన్‌ బాలయ్య, వైస్‌చైర్మన్‌ విజయ్‌గౌడ్‌, సర్పంచులు సుశీల, రజిత, ఎంపీటీసీ ఎల్లమ్మ, నాయకులు శివ, తిరుపతయ్య, శ్రీనివాస్‌రెడ్డి, దా మోదర్‌రెడ్డి, నిరంజన్‌, అర్జున్‌రావు, గోదాదేవి, వెంకటయ్య, రంగయ్య, ఈశ్వరయ్య, కుర్మయ్య సలేశ్వర్‌గౌడ్‌, రైతులు పాల్గొన్నారు.


logo