శనివారం 08 ఆగస్టు 2020
Nagarkurnool - Jul 02, 2020 , 01:43:09

కిశోర బాలికల్లో రోగనిరోధక శక్తిని పెంచాలి

కిశోర బాలికల్లో రోగనిరోధక శక్తిని పెంచాలి

నాగర్‌కర్నూల్‌ టౌన్‌: కిశోర బాలికల్లో రోగనిరోధక శక్తిని పెంచేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని జెడ్పీ చైర్‌పర్సన్‌ పద్మావతిబంగారయ్య సూచించారు. తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే సమా జం కూడా ఆరోగ్యవంతంగా ఉంటుందన్నారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో కేంద్ర ప్రభుత్వ పోషణ్‌ అభియాన్‌ జిల్లాస్థాయి సమన్వయ కమిటీ సమావేశానికి చైర్మన్‌ బుధవారం అధ్యక్షత వహించి మాట్లాడారు. అధికారులు సమన్వయంతో పనిచేస్తూ తల్లీ పిల్లల్లో పోషకాహార లోపం తగ్గించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. పో షకాహార లోపంలేని గ్రామాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా అధికారులు కృషి చేయాలన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో ని ర్దేశించిన లక్ష్యాలను వెంటనే సాధించాలని ఆదేశించారు. రక్తహీనత గుర్తించిన వారందరికీ ఐరన్‌ సప్లిమెంట్‌ అందించాలన్నారు. కల్వకుర్తి జెడ్పీటీసీ భరత్‌ మాట్లాడుతూ గర్భిణులకు, 11-18 ఏండ్ల బాలికలకు ఎ నీమియా సమస్య లేకుండా కర్ణాటక తరహాలో జిల్లాలో కూడా పోషకాలతో కూడిన ఆహార పదార్థ్ధాలను అందించాలన్నారు. అ దనపు కలెక్టర్‌ హనుమంత్‌రెడ్డి మాట్లాడు తూ పోషక అభియాన్‌ ద్వారా చేపట్టే కార్యక్రమాలపై గర్భిణులకు, ఎనీమియా డిఫెన్సివ్‌తో బాధపడుతున్న బాలికల కు పోషకాహారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తామన్నా రు. అంగన్‌వాడీ కార్యకర్త లు కీలక పాత్ర పోషించి పోషక లోపం లేకుండా చూడాలన్నారు. మండలస్థాయిలో నిర్వహించే పో షకాభియాన్‌ సమావేశాలకు జెడ్పీటీసీలను తప్పనిసరిగా ఆహ్వానించాలని బల్మూర్‌ జెడ్పీటీసీ లక్ష్మమ్మ సూచించారు. సమావేశంలో డీఈవో గోవిందరాజులు, జిల్లా పంచాయతీ అధికారి సురేష్‌మోహన్‌, సీపీవో మోహన్‌రెడ్డి, జెడ్పీ డిప్యూటీ సీఈవో, జిల్లా ఇమ్యూనైజేషన్‌ అధికారి సాయినాథ్‌రెడ్డి, పోషక అభియాన్‌ కమిటీ సభ్యులు నాగర్‌కర్నూల్‌ జెడ్పీటీసీ శ్రీశైలం, పదర జెడ్పీటీసీ రాంబాబు, శిశు సంక్షేమశాఖాధికారులు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. logo