ఆదివారం 05 జూలై 2020
Nagarkurnool - Jul 01, 2020 , 01:59:36

నల్లమలను సస్యశ్యామలం చేస్తా

నల్లమలను సస్యశ్యామలం చేస్తా

  • పుట్టినరోజు సందర్భంగా ఆలయాల్లో పూజలు చేసిన గువ్వల దంపతులు

అచ్చంపేట రూరల్‌: సాగునీరందించి నల్లమలను సస్యశ్యామలం చేస్తానని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పేర్కొన్నారు. మంగళవారం తన పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్యే పట్టణంలోని భ్రమరాంబ, ఉమామహేశ్వర క్షేత్రంలో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు చేశారు. ఆయా ఆలయాల వద్ద మొక్కలు నాటి కేక్‌ కట్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయా సమావేశాల్లో గువ్వల మాట్లాడుతూ.. అచ్చంపేట నియోజకవర్గ ప్రజల సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా ముందుకెళ్తానని స్పష్టం చేశారు. పులిజాల వద్ద నిలిచిపోయిన కేఎల్‌ఐ కాల్వను పొడిగించి చంద్రసాగర్‌ను నింపి అక్కడి నుంచి అ మ్రాబాద్‌, పదర మండలాలకు సాగునీరందిస్తామన్నారు. అదేవిధంగా బల్మూ ర్‌ మండలంలో మూడు టీఎంసీల రిజర్వాయర్‌ నిర్మించి చివరి ఆయకట్టుకూ సాగునీరందిస్తామన్నారు. తనను ఎంతగానో ఆదరిస్తున్న నియోజకవర్గ ప్రజలకు బతికినంతకాలం రుణపడి ఉంటానన్నారు. 

రక్తదాన శిబిరానికి అపూర్వ స్పందన

పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి అపూర్వ స్పందన లభించింది. శిబిరంలో 102 మంది రక్తదానం చేయగా వారికి గువ్వల ధన్యవాదాలు తెలిపారు. అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ సభ్యులు క్యాంపు కార్యాలయంలో విప్‌ గువ్వలను సన్మానించి శు భాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్‌ పద్మావతి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు మనోహర్‌, ఎంపీపీలు శాంతాలోక్యానాయక్‌, అరుణ, జెడ్పీటీసీలు మంత్య్రానాయక్‌, రాంబాబునాయక్‌, లక్ష్మి, ప్రతాప్‌రెడ్డి, పాల కేంద్ర చైర్మన్‌ సీఎంరెడ్డి, ఉమామహేశ్వర దేవస్థాన చైర్మన్‌ సుధాకర్‌, మున్సిపల్‌ చైర్మన్‌ తులసీరాం, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు రాజేందర్‌, మండల నాయకులు నర్సింహగౌడ్‌, నరేశ్‌, ఖలీల్‌, రహమతుల్లా, నిజాం, డా విష్ణుమూర్తి, కిశోర్‌, రమేశ్‌రావు, శ్రీనుయాదవ్‌, భిక్షపతి యాదవ్‌ ఉన్నారు.

పర్యావరణాన్ని పరిరక్షిద్దాం

ఉప్పునుంతల: మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు పిలుపునిచ్చారు. మండల పరిధిలోని ఉప్పరిపల్లి, ఉప్పునుంతల, దేవదారికుంట తండాల్లో ఆయన మొక్కలు నాటారు. ఆయా గ్రామాల్లో టీఆర్‌ఎస్‌ నాయకులు ఏర్పాటు చేసిన కేక్‌ను గువ్వల కట్‌చేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ ప్రతాప్‌రెడ్డి, సర్పంచులు ఇంద్రాసేనారెడ్డి, బొట్టు పర్వతాలు, నాయకులు, గోపాల్‌రెడ్డి, బాలూనాయక్‌, వసురాంనాయక్‌ పాల్గొన్నారు.


logo