మంగళవారం 04 ఆగస్టు 2020
Nagarkurnool - Jul 01, 2020 , 01:57:16

మొక్కల సంరక్షణ అందరి బాధ్యత

మొక్కల సంరక్షణ అందరి బాధ్యత

  • హరితహారంలో పాల్గొన్న ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి
  • చౌటబట్లలో సీసీ రోడ్లు, రామాపూర్‌లో బోరు మోటర్‌  ప్రారంభం

కొల్లాపూర్‌: హరితహారంలో నాటిన మొక్కలను సంరక్షించుకునే బాధ్యత అందరిపై ఉందని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని 15వ వార్డు చౌటబట్లలో నిర్మించిన అంతర్గత సీసీ రోడ్లకు ఆయన మంగళవారం రిబ్బన్‌ కట్‌ చేసి ప్రారంభించారు. అనంతరం చైర్‌పర్సన్‌ విజయలక్ష్మి, వైస్‌ చైర్‌పర్సన్‌ మహిమూదాబేగంతో కలిసి హరితహారంలో పా ల్గొని మొక్కలు నాటి నీళ్లు పోశారు. ఈ సం దర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. హరిత తెలంగాణే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ చేపట్టిన హరిత ఉద్యమం ఊరూరా పండుగలా కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గున్‌రెడ్డి నరేందర్‌రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటయ్య, కౌన్సిలర్లు సత్యం, కృష్ణ, నాయకులు ఖాదర్‌పాషా, శివ పాల్గొన్నారు.

తాగునీటి పైప్‌లైన్‌ బోరు ప్రారంభం 

మండలంలోని రామాపూర్‌లో శాశ్వత తాగునీటి కోసం వాగు సమీపంలో వేసిన ట్యాంక్‌కు పైప్‌లైన్‌ ద్వారా నీటిని సరఫరా చేసే బోరును ఎమ్మెల్యే బీరం మంగళవారం సాయంత్రం ప్రారంభించారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గున్‌రెడ్డినరేందర్‌రెడ్డి, ప్రభుత్వ సివిల్‌ దవాఖాన చైర్మన్‌ కాటంజంబులయ్య, కొల్లాపూర్‌ పట్టణ మాజీ ఉపసర్పంచ్‌ చంద్రశేఖారాచారి, సర్పంచ్‌ భారతి, ఎంపీటీసీ వరలక్ష్మి ,గ్రామ టీఆర్‌ఎస్‌ నాయకులు కల్మూరి నిరంజన్‌, ఆడెం నిరంజన్‌, ఉడుతరామస్వామి పాల్గొన్నారు.logo