సోమవారం 06 జూలై 2020
Nagarkurnool - Jun 26, 2020 , 03:07:52

మూడు పాజిటివ్ కేసులు నిర్ధారణ ..

మూడు  పాజిటివ్  కేసులు నిర్ధారణ  ..

నాగర్‌కర్నూల్‌ టౌన్‌: జిల్లా దవాఖానలో పనిచేస్తున్న తొమ్మిది మంది సిబ్బంది శాంపిల్స్‌ను హైదరాబాద్‌కు పంపించగా గురువారం వచ్చిన రిపోర్టుల్లో మరో రెండు కేసులు నమోదైనట్లు కలెక్టర్‌ వెల్లడించారు. రెండు రోజుల కిందట స్టాఫ్‌ నర్సు, సెక్యూరిటీ గార్డులకు పాజిటివ్‌ రాగా గురువారం వచ్చిన రిపోర్టుల్లో ఓ స్టాఫ్‌ నర్సు, మరో స్టాఫ్‌ నర్సు భర్తకు  పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు కలెక్టర్‌ తెలిపారు. వీరికి సంబంధించిన ప్రైమరీ కాంటాక్ట్స్‌ను గుర్తించాలని జిల్లా వైద్యాధికారి సుధాకర్‌లాల్‌, దవాఖాన సూపరింటెండెంట్‌ ప్రభును కలెక్టర్‌ ఆదేశించారు. 


logo