ఆదివారం 09 ఆగస్టు 2020
Nagarkurnool - Jun 23, 2020 , 02:36:16

శ్రీశైలం మల్లన్నకు ప్రత్యేక పూజలు

శ్రీశైలం మల్లన్నకు ప్రత్యేక పూజలు

శ్రీశైలం: భ్రమరాంబికా, మల్లికార్జున స్వామివార్లను దర్శించుకునేందుకు సోమవారం వచ్చిన భక్తులతో ప్రధాన వీధులన్నీ కళకళలాడాయి. మల్లికార్జునుడికి అత్యంత ప్రీతికరమైన సోమవారం రోజున లోక క ల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకులు శాస్ర్తోక్తంగా సహస్త్ర దీపార్చన కార్యక్రమం చేశారు. సాయంత్రం ప్రదోషకాల సమయంలో పురాతణ దీపాలంకరణ మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఊయలలో ఆశీనుల ను చేసి వేదపండితులతో మహాసంకల్పాన్ని పఠించారు. వెయ్యి ఎనిమిది దీపాలను వెలిగించి దీపార్చన చేసి దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం క్షేత్రంలో నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకానికి విరాళంగా గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన శీలం కోటిరెడ్డి లక్ష రూపాయల చెక్కును ఈవోకు అందజేశారు. 

నక్షత్రవనం సుందరీకరణ పనులు వేగవంతం చేయాలి

పరిపాలనా భవనంలో ఆలయ విభాగాధిపతులు, అధికారులతో ఈవో రామారావు సోమవారం ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని విభాగాల్లో మార్పులు తరచూ జరుగుతుంటాయని, అప్పగించిన భాద్యతలపై ఆసక్తి కనబరుస్తూ క్షేత్ర అభివృద్ధికి పాటుపడాలని తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని వసతులు కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందని గుర్తు చేశారు. వీలైనంత త్వరగా నక్షత్రవన ఉద్యాన వనాన్ని సుందరీకరణ చేయాలని సంబంధిత అధికారులను ఈవో ఆదేశించారు. logo