గురువారం 06 ఆగస్టు 2020
Nagarkurnool - Jun 23, 2020 , 02:33:46

పట్టణంలో ముమ్మరంగా పారిశుధ్య పనులు

పట్టణంలో ముమ్మరంగా పారిశుధ్య పనులు

నాగర్‌కర్నూల్‌ టౌన్‌: జిల్లా కేంద్రంలో పారిశుధ్య పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ప్రధాన రహదారి పొడవునా నిర్మించిన డ్రైనేజీలో మురుగును మున్సిపల్‌ సిబ్బంది సోమవారం శుభ్రం చేశారు. చాలా కాలం కిందట నిర్మించిన డ్రైనేజీ ఆక్రమణకు గురై వాన నీరు కూడా వెళ్లేందకు వీలు లేకుండా మారింది. ఈ క్రమంలో ప్రధాన రహదారిలోని కలెక్టరేట్‌ నుంచి కోర్టు ముందు భాగం, ఆర్టీసీ కాంప్లెక్స్‌ పొడవునా పూడుకుపోయిన డ్రైనేజీని మున్సిపల్‌ అధికారులు పరిశీలించి సిబ్బందితో మురుగును తొలగింపజేశారు. ఆర్టీసీ కాంప్లెక్స్‌ పొడవునా ఉన్న డ్రైనేజీ ఆక్రమణకు గురై శుభ్రం చేయలేని పరిస్థితులో ఉండడంతో చిన్నపాటి వర్షం వచ్చినా నీరు బయటకు వెళ్లకుండా అక్కడే ఉండిపోయి ఆ ప్రాంతమంతా దుర్గంధం వెదజల్లేది. సమస్యను గుర్తించిన మున్సిపల్‌ చైర్మన్‌ కల్పనాభాస్కర్‌గౌడ్‌ ఆధ్వర్యంలో ఆక్రమణలను తొలగించి డ్రైనేజీని శుభ్రం చేసి వర్షపునీరు వెళ్లేవిధంగా చేశారు. ప్రధాన రహదారి పొడవునా మూసుకుపోయి ఉన్న డ్రైనేజీని అదనపు కలెక్టర్‌ మనూచౌదరి, ట్రైనీ కలెక్టర్‌ చిత్రమిశ్రాలు పరిశీలించారు. డ్రైనేజీ స్థలం ఆక్రమణకు గురికాకుండా చూడాలని, వాన నీరు డ్రైనేజీ గుండా వెళ్లేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్‌ అధికారులకు సూచించారు. అదేవిధంగా బస్టాండ్‌ ప్రాంగణాన్ని కూడా పరిశీలించారు. వీరివెంట మున్సిపల్‌ కమిషనర్‌ అన్వేశ్‌, వైస్‌ చైర్మన్‌ బాబురావు, కౌన్సిలర్‌ కావలి శ్రీను, నాయకులు బాదం నరేందర్‌ తదితరులు ఉన్నారు. logo