సోమవారం 10 ఆగస్టు 2020
Nagarkurnool - Jun 22, 2020 , 02:27:35

జయశంకర్‌ సార్‌ సేవలు చిరస్మరణీయం

జయశంకర్‌ సార్‌ సేవలు చిరస్మరణీయం

కల్వకుర్తి రూరల్‌: తెలంగాణ ఉద్యమ సాధనలో ప్రొఫెసర్‌ జయశంకర్‌ సేవలు చిరస్మరణీయమని మార్చాల గ్రామ టీఆర్‌ఎస్‌ నాయకులు అన్నారు. ఆదివారం కల్వకుర్తి  మండలం మార్చాల గ్రామంలో టీఆర్‌ఎస్‌ యువజన విభాగం ఆధ్వర్యంలో తెలంగాణ జాతి పిత ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌ వర్ధంతి  నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన సేవలను కొనియాడారు. అదేవిధంగా కల్వకుర్తి పట్టణంలోని తెలంగాణతల్లి, అమరవీరుల ప్రాంగణం వద్ద కల్వకుర్తి తాలూకా బీసీ సబ్‌ప్లాన్‌ కన్వీనర్‌ రాజేందర్‌ ఆధ్వర్యంలో  జయశంకర్‌ సార్‌ వర్ధంతి  నిర్వహించారు.సార్‌ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు మల్లేశ్‌, ఎస్‌ఎంసీ చైర్మన్‌ వెంకటయ్య, వార్డు సభ్యులు డొక్కలింగం, గౌసుద్దీన్‌,  యువజన విభాగం నాయకులు కిశోర్‌, శ్రీను, శ్రీశైలం, రమేశ్‌, బాలరాజు, బీసీ సబ్‌ప్లాన్‌ ప్రధాన కార్యదర్శి గోపాల్‌, నాయకులు దుర్గా ప్రసాద్‌, సాయిలు, యాదగిరాచారి, రవిగౌడ్‌, శేఖరాచారి, చిన్నా, కృష్ణ ఉన్నారు.

వృద్ధాశ్రమంలో..

కల్వకుర్తి: కల్వకుర్తి పట్టణంలోని ప్రజల భాగస్వామ్య సంస్థ వృద్ధాశ్రమంలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌ జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు తెలంగాణ ఉద్యమంలో జయశంకర్‌ సార్‌ కృషిని గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో వృద్ధాశ్రమ నిర్వాహకులు వెంకటయ్య, మల్లేశ్‌, పరశురాములు తదితరులు పాల్గొన్నారు.

వంగూరులో..

వంగూరు:  ప్రొఫెసర్‌ జయశంకర్‌ సర్‌ వర్ధంతి వేడుకలను ఆదివారం వంగూరు మండలంలో వివిధ పార్టీల సమక్షంలో ఘనంగా నిర్వహించారు.  ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జెడ్పీ కో-ఆప్షన్‌సభ్యుడు హమీద్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు నరేందర్‌రావు, మాజీ అధ్యక్షుడు గణేశ్‌రావు, నేతలు ఎల్లాగౌడ్‌, లక్ష్మయ్య, జంగయ్య, బాలస్వామిగౌడ్‌, నర్సిరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, సైదులు, శ్రీశైలం,ఎంపీటీసీ రమేశ్‌, కాంగ్రెస్‌ నేతలు షేర్‌ఖాన్‌, జనార్దన్‌, జంగయ్య తదితరులు పా ల్గొన్నారు.logo