మంగళవారం 11 ఆగస్టు 2020
Nagarkurnool - Jun 21, 2020 , 00:34:12

అందరూ భాగస్వాములు కావాలి

అందరూ భాగస్వాములు కావాలి

  • హరితహారంలో భాగంగా ఇంటింటికీ ఔషధ, పండ్ల మొక్కల పంపిణీ  
  • విలేకరుల సమావేశంలో ప్రభుత్వ విప్‌ గువ్వల

అచ్చంపేట రూరల్‌ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని విప్‌, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కోరారు. శనివారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి ఇంటికీ ఔషధ, పండ్లు, కూరగాయల మొక్కలను పంపిణీ చేస్తామన్నారు. నాటిన ప్రతి మొక్కనూ రక్షించేలా క్షేత్రస్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. ఈ నెల 25వ తేదీ నుంచి హరితహారం ప్రారంభించాలని, ఇందుకు గాను గుంతలు సిద్ధంగా ఉంచాలన్నారు. పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ పిలుపుమేరకు శుక్రవారం ‘గ్రీన్‌ డే’గా.., ఆదివారం ఉదయం 10 గం టల 10 నిమిషాలకు పరిశుభ్రత కోసం సమయం కేటాయించాలన్నారు. పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందన్నారు. రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా నియోజకవర్గ ప్రజలు కొవిడ్‌ నిబంధనలు పాటించాలన్నారు. రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల సం క్షేమ పథకాలను ప్రవేశపెడుతుందన్నారు. సమావేశంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు మనోహర్‌, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు రాజేందర్‌, మున్సిపల్‌ చైర్మన్‌ తులసీరాం, ఎంపీపీ శాంతాలోక్యానాయక్‌, మాజీ ఎంపీపీ పర్వతాలు, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు నర్సింహగౌడ్‌, పట్టణ అధ్యక్షుడు రమేశ్‌రావు, నాయకులు రాజేశ్వర్‌రెడ్డి, శ్రీను, చంద్రమోహన్‌, గోపాల్‌నాయక్‌, నరేశ్‌ తదితరులు ఉన్నారు.

వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి..

బల్మూర్‌ : గ్రామాల్లో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని విప్‌ గువ్వల సూచించారు. శనివారం మండలంలోని వీరంరామాజిపల్లిలో కరోనాపై అవగాహన కల్పించారు. తప్పనిసరి గా మాస్కు పెట్టుకుని బయటకు రావాలన్నారు. కరోనా బా ధితులను ఆదుకుంటామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ అరుణ, జెడ్పీటీసీ లక్ష్మి, విండో చైర్మన్‌ నర్సయ్య, సర్పంచ్‌ జ్యోతి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు మనోహర్‌, నా యకులు వెంకటయ్య, కర్ణాకర్‌రావు, తిర్పతయ్య, గోవర్ధన్‌, భాస్కర్‌రెడ్డి, గోపాల్‌నాయక్‌ పాల్గొన్నారు.


logo