శనివారం 08 ఆగస్టు 2020
Nagarkurnool - Jun 21, 2020 , 00:32:17

రైతుల్లో ఆత్మైస్థెర్యం నింపింది కేసీఆరే

రైతుల్లో ఆత్మైస్థెర్యం నింపింది కేసీఆరే

  • తెలంగాణలో రైతుల ఆలోచన మారింది
  • జడ్పీచైర్‌పర్సన్‌ పద్మావతిబంగారయ్య,ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌ రెడ్డి
  • ఇప్పలపల్లిలో ఆయిల్‌ పామ్‌ సాగు ప్రారంభం
  • తిమ్మాజిపేట: తెలంగాణలో సాగు నష్టాలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతుల్లో ఆత్మైస్థెర్యం నింపి, వ్యవసాయంపై భరోసా నింపింది ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, జెడ్పీ చైర్‌ పర్సన్‌ పద్మావతిబంగారయ్య అన్నారు. శనివారం సాయంత్రం మండలంలోని ఇప్పలపల్లి గ్రామంలో రైతు శేఖర్‌రెడ్డి పొలంలో ఆయిల్‌పామ్‌ సాగును జెడ్పీ చైర్‌పర్సన్‌తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించి మొక్కలు నాటారు. అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. గతంలో రైతులు మొక్కుబడి వ్యవసాయం చేస్తే, నేడు పట్టుదలతో సాగు చేస్తున్నారన్నారు. మన ప్రాంతంలో సారవంతమైన నేలలు ఉన్నాయని, ఆధునిక పంటలు సాగు చేస్తే రైతులు రాజులుగా మారుతారన్నారు. రైతులకు మౌలిక వసతులు కల్పించిన ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదేనన్నారు. వాణిజ్య పంటల సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని, అందులో ఆయిల్‌ పామ్‌ సాగు ఒకటన్నారు. రైతు ఒక్క సంవత్సరం శ్రమిస్తే 27సంవత్సరాల పాటు ఈ పంట ద్వారా ఆదాయం వస్తుందన్నారు. సాగుకు ఎకరాకు ప్రభుత్వం 13వేల దాక సబ్సీడీ ఇస్తుందని, డ్రిప్‌ కోసం 90 శాతం సబ్సిడీ ఇస్తుందని తెలిపారు. రాష్ట్రంలో 22మిలియన్‌ టన్నుల నూనే అవసరమని, 7మిలియన్‌ టన్నులు మాత్రమే మన దగ్గర ఉత్పత్తి అవుతుందన్నారు. పంట సాగు మొదలు పెట్టిన తర్వాత నాలుగు సంవత్సరాల నుంచి కాత వస్తుందని, ఎకరాకు  లక్ష నుంచి లక్షన్నర వరకు ఆదాయం వస్తుందన్నారు. రైతులు ప్రభుత్వం సూచించిన పంటలు సాగు చేయాలని జల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ అన్నారు. హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, భవిష్యత్‌ తరాలకు మంచి వాతావరణాన్ని ఇవ్వాలన్నారు. ఆయిల్‌ పామ్‌ కంపెనీ ఎండీ సుధాకర్‌రెడ్డి సాగు వివరాలను, లాభాలను వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన అధికారి చంద్రశేఖర్‌, డీసీసీబీ డైరక్టర్‌ రఘునందన్‌రెడ్డి, ఎంపీపీ రవీంద్రనాథ్‌రెడ్డి, జెడ్పీటీసీ దయాకర్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ శ్రీనివాస్‌యాదవ్‌, తాసిల్దార్‌ సరస్వతి, ఏడీ రమేశ్‌బాబు, ఏవో కమల్‌కమార్‌, సర్పంచ్‌ మణెమ్మ, ఎంపీటీసీ శాంత, తిమ్మాజిపేట సర్పంచ్‌ వేణుగోపాల్‌గౌడ్‌, వెంకటస్వామ, స్వామి, హుస్సేని, పాండురంగారెడ్డి, అనితశ్యాం పాల్గొన్నారు.


logo