సోమవారం 10 ఆగస్టు 2020
Nagarkurnool - Jun 21, 2020 , 00:28:09

ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలి

ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలి

  • నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలి : బీసీ కమిషన్‌ జాతీయ సభ్యుడు ఆచారి  
  • కలెక్టర్‌, ఎస్పీలతో సమీక్ష

కల్వకుర్తి రూరల్‌ : వంగూరు మండలంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని బీసీ కమిషన్‌ జాతీయ సభ్యులు తల్లోజు ఆచారి సూచించారు. శనివారం కల్వకుర్తి పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలోని సమావేశ మందిరంలో కలెక్టర్‌ శ్రీధర్‌, ఎస్పీ సాయి శేఖర్‌లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆచారి మాట్లాడుతూ ఎంజీకేఎల్‌ఐ కోసం భూములను సేకరించిన రైతులకు నష్టపరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మిడ్జిల్‌, చెదురుపల్లి గ్రామాల్లో నెలకొన్న భూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. పలు సమస్యలపై జిల్లా అధికారులతో చర్చించారు. సమావేశంలో ఆర్డీవో రాజేశ్‌కుమార్‌, డీఎస్పీ గిరిబాబు, ఆయా మండలాల తాసిల్దార్లు పాల్గొన్నారు.

చేనేత కార్మికులను ఆదుకోవాలి

లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి కోల్పోయిన చేనేత కార్మికులను రాష్ట్ర ప్రభు త్వం ఆదుకోవాలని ఆచారి కోరారు. కల్వకుర్తి పట్టణంలో మూడు నెలలుగా ఉపాధి కోల్పోయిన కుకుడాల వెంకటేశ్‌ ఇంటికి వెళ్లి ఆయనతో మాట్లాడారు. మగ్గం ద్వారా నేసిన పోచంపల్లి చీరలను పరిశీలించారు. వెంకటేశ్‌ ఆర్థిక పురోగతికి తన వంతు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో పద్మశాలీ సంఘం అధ్య క్ష, కార్యదర్శులు వెంకటేశ్వర్లు, పాండయ్య, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.


logo