గురువారం 13 ఆగస్టు 2020
Nagarkurnool - Jun 21, 2020 , 00:26:10

ఘర్షణలో మహిళ మృతి

ఘర్షణలో మహిళ మృతి


అమ్రాబాద్‌ : ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఓ మహిళ మృ తి చెందిన సంఘటన మండలంలోని ఇప్పలపల్లి గ్రామంలో శుక్రవా రం రాత్రి చోటుచేసుకుంది. సీఐ బీసన్న కథనం ప్రకారం.. ఇప్పలప ల్లి గ్రామానికి చెందిన మోతిలాల్‌ అనే వ్యక్తి చందులాల్‌ వద్ద కూలీ పని చేస్తున్నాడు. రూ.12 వేలు కూలి చెల్లించినప్పటికీ చందులాల్‌ ఇంటికి ఫోన్‌చేసి ఇంకా డబ్బులు కావాలని మోతిలాల్‌ సతాయించా డు. దీంతో చందులాల్‌ ఫోన్‌ తీసుకొని డబ్బులిచ్చాను, అయినా ఎం దుకు చేస్తున్నావు అని గొడవపడ్డాడు. ఈ క్రమంలో మోతిలాల్‌ శుక్రవారం రాత్రి చందులాల్‌ ఇంటికి వచ్చాడు. కుటుంబసభ్యులంతా మిద్దెపై ఉండడంతో అక్కడికి వెళ్లి వాగ్వివాదానికి దిగాడు. గొడవపడుతూ మిద్దెపై నుంచి కిందకు దిగుతుండగా మెట్లకు రేలింగ్‌ లేకపోవడంతో మద్యం మత్తులో ఉన్న చందులాల్‌ తల్లి రక్మ(55) జారి కిందపడింది. మోతిలాల్‌ ఆటోలో రక్మను పదర దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతిచెందింది. చందులాల్‌ ఫిర్యాదు మేరకు మోతిలాల్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ఇదిలా ఉండగా, మోతిలాల్‌ మెట్ల మీద నుంచి కిందకు పడేసి నట్లు చందులాల్‌ ఫిర్యాదు చేయగా, పోలీసులు మాత్రం మృతురా లు మద్యం మత్తులో జారి పడిందని అంటున్నారు. పూర్తి స్థాయి విచారణ చేసి వివరాలు వెల్లడించనున్నట్లు ఎస్సై సురేశ్‌ తెలిపారు.


logo