బుధవారం 12 ఆగస్టు 2020
Nagarkurnool - Jun 14, 2020 , 02:35:12

శ్రీశైలంలో దర్శనభాగ్యం

శ్రీశైలంలో దర్శనభాగ్యం

శ్రీశైలం : భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనభాగ్యం కోసం భక్తులు వస్తున్నట్లు ఈవో రామారావు తెలిపారు. శనివారం ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన దర్శనాలకు భక్తులు ముందుగానే ఆన్‌లైన్‌ ద్వారా టిక్కెట్లు బుక్‌ చేసుకుని వచ్చారన్నారు. స్వామి అమ్మవార్ల లఘుదర్శనానికి మాత్రమే అనుమతిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఆర్జిత సేవలను పరోక్షసేవగానే నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కరోనా నిబంధనలు పాటిస్తూ ఆలయ సిబ్బందికి సహకరించాలని కో రారు. భక్తులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని శ్రీశైలం వన్‌టౌన్‌ ఎస్సై హరిప్రసాద్‌ హెచ్చరించారు. మా స్కులు లేకుండా తిరిగితే రూ.500 నుంచి రూ.1000 జరిమానా విధించనున్నట్లు తెలిపారు. ముందుగా ఈ పాస్‌లు పొంది దర్శన టికెట్‌లను వెంట ఉంచుకోవాలని చెప్పారు. 


logo