శనివారం 15 ఆగస్టు 2020
Nagarkurnool - Jun 12, 2020 , 10:04:13

ఉన్నత విద్యనభ్యసించి.. ఉద్యోగాన్ని వదిలి... సేంద్రియ పంటలు సాగు

ఉన్నత విద్యనభ్యసించి.. ఉద్యోగాన్ని వదిలి... సేంద్రియ పంటలు సాగు

ఉన్నత విద్యనభ్యసించి.. ఉద్యోగాన్ని వదిలి ఎకరంన్నర పొలంలో సేంద్రియ పంటలు సాగుచేస్తూ ఏడాదికి రూ.16లక్షలు సంపాదిస్తున్న నారాయణపేట యువరైతు గట్టు అనిల్‌ను పలువురు ప్రశంసిస్తున్నారు. ఇటీవల ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ప్రచురితమైన కథనాన్ని చదివిన నారాయణపేట ఎమ్మెల్యే ఎస్‌ రాజేందర్‌రెడ్డి గురువారం మధ్యాహ్నం స్వయంగా వ్యవసాయ క్షేత్రానికి వెళ్లి పరిశీలించారు. దాదాపు రెండు గంటల పాటు కూర గాయల తోటలో పర్యటించి యువరైతు అనిల్‌తో పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేవలం ఎకరంన్నర పొలంలో 24 రకాల కూరగాయల పంటలు పండిస్తూ ఏడాదికి లక్షల్లో సంపాధించడం ఎంతో ఆదర్శనీయమని అనిల్‌ను ఎమ్మెల్యే ప్రశంసించారు. అదేవిధంగా గట్టు అనిల్‌ తల్లి గట్టు అంజనమ్మను ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి శాలువాతో సన్మానించారు. ఇదే కోవలో మరెంతో మంది యువ రైతులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. 

- నారాయణపేట 


logo