బుధవారం 12 ఆగస్టు 2020
Nagarkurnool - Jun 11, 2020 , 05:05:42

రైతుబంధుకు దరఖాస్తుల స్వీకరణ

రైతుబంధుకు దరఖాస్తుల స్వీకరణ

కల్వకుర్తి రూరల్‌: పట్టణంలోని మండల వ్యవసాయ కార్యాలయంలో బుధవారం రైతుబంధు పథకానికి సంబంధించి రైతుల నుంచి వ్యవసాయాధికారులు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. 2020 జనవరి లోగా పాస్‌పుస్తకాలు పొందిన వారికి ప్రభుత్వం అవకాశం కల్పించడంతో మండలంలోని ఆయా గ్రామాలు, పట్టణంలో అర్హులు దరఖాస్తు ఫారాలను వ్యవసాయాధికారులకు అందించారు. అదేవిధంగా పట్టణంలోని రైతు ఆగ్రోస్‌ కేంద్రం, పీఏసీసీఎస్‌లలో విత్తనాల నమూనాలను అధికారులు సేకరించారు. కార్యక్రమంలో ఏఈవోలు లావణ్య, రాకేశ్‌, రజినీకాంత్‌ తదితరులు ఉన్నారు.


logo