బుధవారం 12 ఆగస్టు 2020
Nagarkurnool - Jun 11, 2020 , 05:04:39

వైద్య సేవలు అందుబాటులో ఉంచాలి

వైద్య సేవలు అందుబాటులో ఉంచాలి

  • వీసీలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల

మహబూబ్‌నగర్‌/నాగర్‌కర్నూల్‌ టౌన్‌/వనపర్తి : క రోనా పాజిటివ్‌ వచ్చిన వ్య క్తులకు ఇంట్లోనే వైద్య సేవ లు అందుబాటులో ఉంచేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. బుధవారం హైదరాబాద్‌ నుంచి అన్ని జిల్లాల వైద్యఅధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వైరస్‌ సోకిన వ్యక్తులకు నిబంధనల మేరకు వైద్య సేవలు అందించాలన్నారు. ఇబ్బందులుంటే తక్షణమే అవసరమైన సదుపాయాలను కల్పించాలని సూచించారు. జిల్లాల్లోనే చికిత్సలందించడం వల్ల గాంధీ దవాఖానపై అధిక భారం పడదన్నారు. క్షయ వ్యాధిగ్రస్తులతోపాటు సీజనల్‌ వ్యాధుల నిర్మూలనకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. పీహెచ్‌సీలలో పరిశుభ్రత పాటించాలని తెలిపారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు స్థానికంగానే చికిత్సలు నిర్వహించాలన్నారు. ఒక వ్యక్తికి డయాలసిస్‌ చేసిన తర్వాత యంత్రాలను శానిటైజేషన్‌ చేయాలన్నారు. హైదరాబాద్‌కు ఎట్టిపరిస్థితుల్లోనూ రెఫర్‌ చేయకూడదని సూచించారు. ప్రతి డాక్టర్‌, సిబ్బంది ఆరోగ్యపరమైన జాగ్రత్తలు వహించాలన్నారు. పీపీఈ కిట్లు, గ్లౌజులు, శానిటేషన్‌కు సంబంధించిన అన్ని వసతులను కల్పించామని, ప్రతిఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వీసీలో డీఎంహెచ్‌వోలు కృష్ణ, సుధాకర్‌లాల్‌, శ్రీనివాసు లు, డాక్టర్‌ సాయినాథ్‌రెడ్డి, వనపర్తి ప్రోగ్రాం అధికారి రవిశంకర్‌, దవాఖాన సూ పరిటెండెంట్‌ హరీశ్‌, గైనకాలజిస్ట్‌ పల్లవి, అరుణజ్యోతి పాల్గొన్నారు


logo