సోమవారం 10 ఆగస్టు 2020
Nagarkurnool - Jun 09, 2020 , 06:28:00

మమ్మరంగా పారిశుధ్య పనులు

మమ్మరంగా పారిశుధ్య పనులు

ముగిసిన వారోత్సవాలు

నాగర్‌కర్నూల్‌ టౌన్‌/తిమ్మాజిపేట/తెలకపల్లి: నియోజకవర్గంలోని ఆయా గ్రామాల్లో పల్లె ప్రగతి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. కుమ్మెర గ్రామాన్ని  ప్రత్యేకాధికారి రమాదేవి సోమవారం సందర్శించారు. గ్రామంలోని డ్రైనేజీలను,  పాడుబడిన బావులను పరిశీలించారు. ప్రమాదకరంగా ఇండ్ల మధ్య ఉన్న బావులను పూడ్చి వేయాలని ఆదేశించారు. పల్లె ప్రగతిలో మిగిలిపోయిన పనులను పూర్తి చేసుకోవాలని మండల ప్రత్యేకాధికారి ఉషారాణికి సూచించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ శ్రీశైలం, ఎంపీడీవో కోటేశ్వర్‌, ఎంపీవో లింగయ్య, పంచాయతీ కార్యదర్శి మద్దిలేటి, కారోబార్‌ ఆలూరు ఆంజనేయులు, ఆశా వర్కర్లు అనసూయ, రాములమ్మ, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. 

తిమ్మాజిపేట మండలం గొరిట గ్రామంలో అంతర్గత రోడ్లన్నింటికీ మరమ్మతులు చేపడుతున్నారు. పల్లె ప్రగతిలో భాగంగా గ్రామంలో అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసి, వాటిపై రోడ్ల నిర్మాణం చేపడుతున్నారు. వర్షాలు ప్రారంభమయ్యేవరకు రోడ్ల మరమ్మతులు పూర్తి చేయనున్నట్లు సర్పంచ్‌ మురళీధర్‌రెడ్డి తెలిపారు. తిమ్మాజిపేట మండలం చేగుంట గ్రామంలో ప్రధాన రోడ్లను ఊడ్చి, మొక్కలకు ట్యాంకర్ల ద్వారా నీళ్లు పోశారు. పోతిరెడ్డిపల్లిలో డంపింగ్‌ యార్డ్‌ వద్ద షెడ్‌ను ఏర్పాటు చేశారు. ఇప్పలపల్లిలో ఒకే చోట డంపింగ్‌, శ్మశాన వాటికను ఏర్పాటు చేశారు. తిమ్మాజిపేటలో స్మృతి వనం ఏర్పాటు చేశారు. తెలకపల్లిలో ఈవో బాలరాజు ఆధ్వర్యంలో గుంతలను పూడ్చి వేశారు. logo