గురువారం 13 ఆగస్టు 2020
Nagarkurnool - Jun 07, 2020 , 03:40:22

తెరుచుకోనున్న ఆలయాలు, మసీదులు, చర్చిలు

తెరుచుకోనున్న ఆలయాలు, మసీదులు, చర్చిలు

 • రేపటి నుంచి భక్తులకు అనుమతి

నాగర్‌కర్నూల్‌, నమస్తే తెలంగాణ : కరోనా ప్ర భావంతో మూతపడిన దేవాలయాలు సోమవా రం తెరుచుకోనున్నాయి. ప్రతిరోజూ ఆలయాల ను దర్శించుకోనిదే ఇతర కార్యక్రమాలను ప్రారంభించని భక్తుల కోరిక ఎట్టకేలకు సాకారం కానున్నది. కరోనా నేపథ్యంలో మార్చి 23వ తేదీ నుం చి ఆలయాలతో పాటుగా మసీదులు, చర్చిలు సై తం మూతపడ్డాయి. ఈ మధ్య కాలంలో హిం దూ, ముస్లిం, క్రిస్టియన్లు తమ ప్రార్థనలకు దూరమయ్యారు. అయితే కొవిడ్‌ నిబంధనలను తప్పకుండా అమలు చేస్తూ భక్తుల దర్శనాలు జరిపేలా ప్రభుత్వాలు ఆదేశించడంతో ఆలయాలు, మసీదులు, చర్చిల్లో నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణలో ప్రస్తుతం ఇచ్చిన సడలింపుల అనుమతులను ప్రభుత్వ ఆదేశంతో వారం రోజుల పాటు దేవాదాయ శాఖ పర్యవేక్షిస్తుంది. ఈ క్రమం లో కరోనా కేసులు పెరిగితే మరిన్ని మార్గదర్శకా లను అనుమతిస్తారు.

6 గంటల నుంచి..

కొల్లాపూర్‌ : మండలంలోని సింగవట్నం  లక్ష్మీనర్సింహస్వామి, రత్నలక్ష్మీ అమ్మవారి ఆలయా ల్లో సోమవారం ఉదయం 6 గంటల నుంచి స్వామి వా రికి అభిషేకాలతో పూజలు చేయనున్నట్లు పూజారి సతీశ్‌శర్మ తెలిపారు. ప్రతిరోజు ఉదయం 6 నుంచి సాయంత్రం 7 గం టల వరకు భక్తులకు అనుమతి ఉంటుందని చెప్పారు. సోమశిలలో కృష్ణానదీ తీరంలో వెలసిన లలితాంబికా సోమేశ్వరస్వా మి ఆలయాల్లోని ద్వాదశ లింగాలను ఈనెల 8వ తేదీన ఉ దయం శుద్ధి చేయనున్నట్లు పూజారి వెంకటేశ్వరశర్మ తె లిపారు. ప్రతి రోజు ఉదయం 8:30 నుంచి సా యంత్రం 6 గంటల వరకు భక్తులకు అనుమతి ఉంటుందన్నారు.

ఐదో శక్తిపీఠంలో..

అలంపూర్‌ : అష్టాదశ శక్తిపీఠాల్లో ఐదో శక్తిపీఠంగా విరాజిల్లుతున్న జోగుళాంబ బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయం సోమవారం నుంచి తెరుచుకోనున్నది. ఇందుకు గాను అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ సూచనల మేరకు కేవలం ధర్మదర్శనాలకు మాత్రమే అనుమతించనున్నారు. ఆర్జిత సేవల్లో భక్తులు ప్రత్యక్షంగా పాల్గొనే అవకాశం లేదు. ఆన్‌లైన్‌ సేవలు యథావిధిగా కొనసాగనున్నాయి. స్పర్శదర్శనం కాకుండా లఘుదర్శనం మాత్రమే ఉంటుంది. 85 ఏళ్ల పైబడిన వృద్ధులు, 10 ఏళ్ల లోపు వయసున్న చిన్నారులకు దర్శన అనుమతులు ఉండవని ఈవో ప్రేమ్‌కుమార్‌ తెలిపారు. 

మన్యంకొండలో ఉదయం 7 నుంచి..

మహబూబ్‌నగర్‌ రూరల్‌ : పేదల తిరుపతిగా పేరుగాంచిన మన్యంకొండ లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయంలో సోమవారం నుంచి దర్శనం ఉంటుందని దేవాలయ చైర్మన్‌ మధుసూదన్‌ కుమార్‌ తెలిపారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే భక్తులకు అనుమతి ఉంటుందని చెప్పారు. పదేండ్లలోపు చిన్నారులు, 65 ఏండ్లు పైబడిన వృద్ధులకు అనుమతి లేదన్నారు. దర్శనానికి పూలు, పండ్లు తీసుకురాకూడదన్నారు. ఈ క్రమంలో శనివారం ఆలయంలోని బారికేడ్లు, ఆలయాన్ని శానిటైజేషన్‌ చేశారు. 

నిబంధనల మేరకే..

పెబ్బేరు రూరల్‌ (శ్రీరంగాపురం) : కొవిడ్‌ నిబంధనల మేరకే శ్రీరంగాపురంలోని రంగనాథస్వామి ఆలయంలో భక్తులకు దర్శనభాగ్యం కల్పించనున్నట్లు ఈవో సత్యచంద్రారెడ్డి చెప్పారు. తమ సిబ్బందే భక్తుల చేతులను శానిటైజేషన్‌ చేస్తారని, ఆలయంలో రోజూ రసాయన మందులు పిచికారీ చేయిస్తామన్నా రు. ఒకరి తర్వాత ఒకరిని అనుమతిస్తామని, ఉదయం 6 నుం చి రాత్రి 8 గంటల వరకు దర్శనం ఉంటుందని వివరించారు. 

ఇవీ నిబంధనలు

 •  ప్రవేశద్వారం వద్ద హ్యాండ్‌ శానిటైజర్‌, థర్మల్‌ స్క్రీనింగ్‌ ఉండాలి.
 • కరోనా లక్షణాలు లేని వారిని మాత్రమే అనుమతించాలి.
 •  మాస్క్‌, ఫేస్‌కవర్‌ ఉంటేనే భక్తులకు అనుమతి.
 • కొవిడ్‌ రాకుండా తీసుకునే జాగ్రత్తల పోస్టర్లు, స్టాండ్లు ప్రదర్శించాలి.
 •  చెప్పులు, బూట్లులాంటి వాటిని సొంత వాహనాల్లోనే విడిచి రావాలి. 
 • ప్రార్థనా మందిరాల లోపల, బయట రద్దీ లేకుండా చూడాలి.
 •  క్యూ మార్గాల్లో మార్కింగ్‌లు గీసి భక్తులచే పాటింపజేయాలి.
 • క్యూలో ఒకరికొకరికి మధ్య కనీసం ఆరడుగుల దూరం పాటించాలి.
 • ప్రార్థనా మందిరం లోపలికి వెళ్లేటప్పుడు తప్పనిసరిగా సబ్బు లేదా శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకోవాలి.
 • ఆలయాల్లో విగ్రహాలను తాకకూడదు.
 • గుడి గంటలను మోగించకూడదు.
 •  ప్రసాదాలు, తీర్థం, తలపై జలాలు చల్లుకోవడం నిషేధం.
 •  అన్నదానం చేసేటప్పుడు సామాజిక దూరం పాటించాలి.
 • ప్రార్థనా మందిరాలను తరచూ శుభ్రం చేయాలి.
 •  ఫేస్‌ కవర్లు, మాస్కులను ప్రత్యేక స్థలాల్లోనే వేసేలా ఏర్పాట్లు చేయాలి.
 •  కొబ్బరికాయ కొట్టడం, తలనీలాల సమర్పణ నిషేధం.
 •  అన్నదానం, సంతర్పణలు గతం మాదిరి కాకుండా ప్యాకెట్లలోనే ఇవ్వాలి.
 • ఆలయాల కల్యాణ మంటపాలు సైతం మూసే ఉంటాయి.
 •  దేవాలయాల సమీపాల్లోని దుకాణాల్లో అమ్మే ప్రసాదాలకు మాత్రం అనుమతి.
 • ఇంటి నుంచి కూడా తెచ్చే నైవేద్యాలు, ప్రసాదాలకు అనుమతి లేదు.
 • దేవుడికి ప్రదక్షిణలు చేసుకొని నమస్కరించి నిష్క్రమించాలి.

ఉదయం 5:30కు పూజలు

మూసాపేట : దేవరకద్ర నియోజకవర్గంలో ప్రధాన ఆలయాలైన కురుమూర్తి, కందూరు రామలింగేశ్వరస్వామి ఆలయాల్లో సోమవారం నుంచి భక్తులకు దర్శనం కల్పించనున్నారు. ఉదయం 5:30 గంటలకు స్వామి వారికి ప్రత్యేక అభిషేకం, పూజలు నిర్వహించనున్నారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులకు దర్శనం కోసం అనుమతి ఉంటుందని ఆలయ సిబ్బంది తెలిపారు. 

సాయంత్రం 6 వరకు..

అచ్చంపేట రూరల్‌ : శ్రీశైల ఉత్తర ద్వారమైన ఉమామహేశ్వర క్షేత్రంలో సోమవారం ఉదయం 7 నుంచి భక్తులకు అనుమతి ఉంటుందని ఈవో శ్రీనివాస్‌రావు, చైర్మన్‌ సుధాకర్‌ తెలిపారు. సాయంత్రం 6 గంటల వరకు ఆలయం తెరిచే ఉంటుందని, నిత్యం 500 మందికి మాత్రమే దర్శనభాగ్యం ఉంటుందన్నారు. 


logo