శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
Nagarkurnool - Jun 07, 2020 , 03:33:24

కరోనాతో ఒకరి మృతి

కరోనాతో ఒకరి మృతి

  • మరో ముగ్గురికి పాజిటివ్‌
  • పాలమూరులో 13కు చేరిన కేసులు
  • అప్రమత్తమైన అధికారులు 
  • మర్రిపల్లిలో పర్యటించిన ఎస్పీ, డీఎంహెచ్‌వో

 ఉమ్మడి జిల్లాలో కరోనా రోజురోజుకూ విస్తరిస్తున్నది.  శనివారం నాగర్‌కర్నూల్‌ జిల్లా ఉప్పునుంతల మండలం మర్రిపల్లి గ్రామానికి చెందిన 60 ఏండ్ల వృద్ధుడు కరోనాతో హైదరాబాద్‌ గాంధీ దవాఖానలో మృతి చెందగా.. బిజినేపల్లి మండలం ఖానాపూర్‌లో మరో వ్యక్తికి పాజిటివ్‌ వచ్చింది. మహబూబ్‌నగర్‌ జిల్లా అల్లీపూర్‌లో హోంగార్డుతోపాటు జిల్లా కేంద్రానికి చెందిన మరో మహిళకు కూడా పాజిటివ్‌ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దీంతో పాలమూరు జిల్లాలో కేసుల సంఖ్య 13కు చేరింది. వృద్ధుడి మృతిలో మర్రిపల్లిలో నాగర్‌కర్నూల్‌ ఎస్పీ సాయిశేఖర్‌, డీఎంహెచ్‌వో సుధాకర్‌లాల్‌ పర్యటించారు. 

- మహబూబ్‌నగర్‌ వైద్య విభాగం/ నాగర్‌కర్నూల్‌ టౌన్‌/బిజినేపల్లి/ఉప్పునుంతల

నాగర్‌కర్నూల్‌ టౌన్‌/ఉప్పునుంతల : నా గర్‌కర్నూల్‌ జిల్లాలోని ఉప్పునుంతల మండ లం మర్రిపల్లి గ్రామానికి చెందిన 60 ఏండ్ల వృద్ధుడు కరోనాతో మృతి చెందినట్లు కలెక్టర్‌ శ్రీధర్‌ శనివారం ప్రకటించారు. హైదరాబా ద్‌లోని కాటేదాన్‌లో పనిచేస్తున్న సదరు వృద్ధుడు గాంధీ దవాఖానలో చికిత్స పొందు తూ మరణించినట్లు తెలిపారు. లాక్‌డౌన్‌ కారణంగా ఇటీవల సొంత గ్రామానికి రాగా, డయాబెటిస్‌, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నందున వారం కిందట హైదరాబాద్‌కు చికిత్స నిమిత్తం వెళ్లాడని, అక్కడే కరోనా పాజిటివ్‌ రావడంతో గాంధీ దవాఖానకు తరలించారని చెప్పారు. ఈ క్రమంలో అక్కడే చికిత్స పొందుతూ మరణించినట్లు కలెక్టర్‌ పేర్కొన్నారు. ఇతనికి సంబంధించి ఇప్పటి వర కు ఏడుగురు ప్రైమరీ కాంటాక్ట్స్‌ను గుర్తించామని, ఇంకా ఎవరైనా ఉన్నారా విషయంపై ఆరా తీస్తున్నామని తెలిపారు. కాగా, మర్రిపల్లి గ్రామాన్ని ఎస్పీ సాయిశేఖర్‌, డీఎంహెచ్‌వో సుధాకర్‌లాల్‌ సందర్శించారు. నెల కిందట జరిగిన సదరు వృద్ధుడి తల్లి అంత్యక్రియల్లో, దశది నకర్మలో పాల్గొన్న వారి వివరాలు సేకరించాలని ఎస్సై రమేశ్‌కు సూచించారు. అలాగే వారం రోజుల కిందట ఉప్పునుంతలలో మృతి చెందిన చిన్నారి కుటుంబసభ్యుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. 

ముగ్గురికి పాజిటివ్‌ 

మహబూబ్‌నగర్‌ వైద్యవిభాగం/బిజినేపల్లి : గద్వాల జిల్లాలో పనిచేస్తున్న మహబూబ్‌నగర్‌ మండలంలోని అల్లీపూర్‌ గ్రా మానికి చెందిన హోంగార్డుకు కరోనా లక్షణా లు ఉండడంతో శాంపిల్స్‌ను శుక్రవారం హైదరాబాద్‌కు పంపించారు. శనివారం పా జిటివ్‌ ఉన్నట్లు రిపోర్టు వచ్చిందని డీఎంహెచ్‌వో కృష్ణ చెప్పారు. అలాగే మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ బంగ్లా సమీపంలోని న్యూగంజ్‌ ప్రాంతానికి చెందిన ఓ మహిళ గత ఎనిమిది నెలలుగా క్యాన్సర్‌ వ్యా ధితో హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నది. ఈ క్రమంలో ఆమెకు వైద్య ప రీక్షలు చేయగా కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు డీ ఎం హెచ్‌వో తెలిపారు. బిజినేపల్లి మండలంలో ని ఖానాపూర్‌ గ్రా మానికి చెందిన 22 ఏండ్ల యువకుడు వనపర్తి జిల్లా గోపాల్‌పేట మం డలంలోని తాడిపర్తిలో విద్యుదాఘాతానికి గురికాగా, చికిత్స నిమిత్తం హైదరాబాద్‌ ద వాఖానకు తరలించారు. అక్కడ కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్‌ వచ్చినట్లు జిల్లా అధికారులు తెలిపారు. 


logo