బుధవారం 05 ఆగస్టు 2020
Nagarkurnool - Jun 06, 2020 , 02:47:24

ఆధునిక సాగుతో ఆర్థికాభివృద్ధి

ఆధునిక సాగుతో ఆర్థికాభివృద్ధి

  • ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి

పెద్దకొత్తపల్లి :  సీఎం కేసీఆర్‌ చేపట్టిన నూతన వ్యవసాయ సాగుతో రైతుల ఆర్థికాభివృద్ధి చెందవచ్చని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని కల్వకోలు, మరికల్‌ గ్రామాల్లో నియంత్రిత సాగుపై రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. రైతులు పత్తి, కందులు, జొన్న, రాగులు, సన్నరకం వరిపంటలు వేసుకోవాలని రైతులకు సూచించారు. ప్రతిగ్రామంలో రైతులు వ్యవసాయాధికారుల సూచనలు, సలహాల మేరకు సాగు చేపట్టాలని తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ నరేందర్‌రెడ్డి, జెడ్పీటీసీ గౌరమ్మ, సర్పంచులు కృష్ణవేణి, ఉజ్వల, సింగిల్‌విండో చైర్మన్లు రాజగౌడ్‌, శ్రీనివాసులు, వైస్‌ చైర్మన్‌ రాము, టీఆర్‌ఎస్‌ మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసులు,వ్యవసాయాధికారి రజియాబేగం, ఉప స ర్పంచ్‌ జగన్‌,ఎంపీటీసీ వెంకటస్వామి, మాజీఎంపీపీ వెంకటేశ్వర్‌రావు, టీఆర్‌ఎస్‌ నాయకులు ఉన్నారు.

బాధితుడిని పరామర్శించిన ఎమ్మెల్యే

మండలంలోని మరికల్‌ గ్రామానికి చెందిన లింగస్వామి గత నెలలో రోడ్డు ప్రమాదానికి గురై హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ దవాఖానలో చికిత్స పొందాడు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి  గ్రామానికి చేరుకొని బాధితుడిని పరామర్శించారు.  ప్రభుత్వపరంగా ఆదుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. 

లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ

కొల్లాపూర్‌ : మండలంలోని కుడికిళ్ల, అంకిరావుపల్లి గ్రామాలకు చెందిన కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు పట్టణంలో క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కుడికిళ్ల ఎంపీటీసీ కొండ్రబుచ్చయ్య, టీఆర్‌ఎస్‌ పట్టణ నాయకుడు ఖాదర్‌పాషా పాల్గొన్నారు.logo